ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వం, దాని మిత్రపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లాలో ఆయా ప్రభుత్వాల దిష్టిబొమ్మలు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం రోడ్డుపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి టీడీపీ మద్ధతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.