ప్రతిపక్షం మేమే.. అధికార పక్షం మేమే | Opposition to the ruling party ourselves to ourselves .. | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షం మేమే.. అధికార పక్షం మేమే

Published Fri, Aug 19 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

Opposition to the ruling party ourselves to ourselves ..

  • వరంగల్‌ను విడగొట్టడం సరికాదు
  • కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ను కలుస్తాం
  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  
  • పరకాల : అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్షం.. అధికా ర పక్షం.. రెండూ మేమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు కోసం వరంగల్‌ పట్టణాన్ని రెండుగా విడగొట్ట డం సరికాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుతూ ఆత్మ బలి దానాలకు పాల్పడిన అమరులు ఓకారం లక్ష్మణరాజు, కొక్కిరాల సంపత్‌రావు కుటుంబాలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ఎమ్మెల్యే ధర్మారెడ్డి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌లో అంతర్భాగంగా ఉన్న హన్మకొండ ను విడగొట్టి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
     
    ఎక్కడో ఉన్న పాలకుర్తి, జమ్మికుంట, హుస్నాబాద్‌ను హన్మకొండకు తీసుకురావడం.. ఇటు ఉన్న ప్రాంతాలను అటు కలుపడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయం పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలమంతా కలిసి వాస్తవ పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామన్నారు. ఏ జిల్లాకు అనుగుణంగా ఉన్న మండలాలను ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలన్నారు. జిల్లాల అంశమే తేలలేదని ఇప్పుడే పరకాలలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల ఆహ్వానం మేరకు తాను 70వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం కోసం అక్కడికి వెళ్లానన్నారు. అనంతరం విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దుబాసి వెంకటస్వామి, వజ్ర రవికుమార్, నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, రేగూరి విజయపాల్‌రెడ్డి, బొచ్చు జితేందర్, దగ్గు విజేందర్‌రావు, తహసీల్థార్‌ పోరిక హరికృష్ణ, ఆర్‌ఐ శ్రీధర్, వీఆర్వోలు సాయిని ముత్యం, కుమారస్వామి పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement