ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రూ.175 కోట్లు
కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.175 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను దత్తాత్రేయ కలుసుకొని లేఖను అందించారు. 2017-18 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరంలోకి అడుగిడుతోందని, దేశ నిర్మాణంలో ఉస్మానియా వర్సిటీ అందించిన సేవలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఓయూలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సి ఉందని దత్తాత్రేయ వివరించారు. శతాబ్ది బిల్డింగ్ నిర్మాణానికి రూ.25 కోట్లు, క్యాంపస్‌లోని హెరిటేజ్ బిల్డింగ్‌లైన ఆర్ట్స్ కాలేజ్, మంజూరు చేయాలని దత్తాత్రేయ కోరారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం తనకు పంపిన ప్రతిపాదన ప్రతిని దత్తాత్రేయ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందించారు.