ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు | OWAISI fire on congress and tdp | Sakshi
Sakshi News home page

ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు

Published Sun, Apr 3 2016 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు

ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

 సిద్దిపేట టౌన్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలు తమ ఉనికి కోల్పోయాయని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శని వారంరాత్రి మెదక్ జిల్లా సిద్దిపేట ఈద్గా మైదానంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన కాంగ్రెస్‌పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం తంటాలు పడుతుందన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ దుకాణం మూతపడిందన్నారు. రాబోయేరోజుల్లో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడతామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీకి తామే గట్టి పోటీనిచ్చామన్నారు. దేశంలో మత ఛాందసవాదం పెట్రేగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement