పీజీ విద్యార్థి బలవన్మరణం
Published Mon, Sep 12 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
మల్యాల: మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన రామడుగు నరేశ్(22) అనే పీజీ విద్యార్థి సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరేశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తల్లి గంగవ్వ బీడీలు చుట్టుకునేందుకు పక్కింటికి వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చేసరికి తలుపువేసి కనబడడంతో ఆదుర్దాగా తలుపులు తీయగా.. నరేశ్ ఉరివేసుకుని కనిపించాడు. పక్కింటివారి సాయంతో నరేశ్‌ను కిందికి దింపగా కొద్దిసేపటికే వృతిచెందాడు. నరేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై నీలం రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు
చొప్పదండి : మండలంలోని రుక్మాపూర్ గురుకుల విద్యాలయంలో పదో విద్యార్థి గొలిపల్లి శ్రీనివాస్(15) అదశ్యంపై చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు శ్రీనివాస్ ఐదేళ్లుగా రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదువుతున్నాడు. ఈనెల మూడోతేదీ సాయంత్రం తనకు జ్వరం వచ్చిందని, కరీంనగర్‌లో ఉండే తన సోదరిని కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి పాఠశాల నుంచి వెళ్లాడు. కాగా.. ఆదివారం గురుకుల విద్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులకు వారం క్రితమే బడి నుంచి వెళ్లాడని సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందిన వారు చొప్పదండి పోలీసులను సంప్రదించారు. చంద్రయ్య ఫిర్యాదుపై ఎస్సై కేసు నమోదు చేశారు.
కాగా.. విద్యార్థి శ్రీనివాస్ వద్ద మొబైల్ ఉందని, దాని నుండి తరచూ బంధువులకు మెసేజ్‌లు పంపిస్తూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి జాడ తెలుసుకునేందుకు మొబైల్ ట్రేస్ చేయడమే మార్గంగా మారింది. శ్రీనివాస్ ఫేస్‌బుక్‌లో కూడా ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం కూడా శ్రీనివాస్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement