
రామడుగు(చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్న రాగమల్ల అమల (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం హత్య చేసి పరారయ్యారు. సిద్దిపేట జిల్లాకేంద్రం సమీపంలోని పుల్లూరుకు చెందిన అమల రెండు నెలలక్రితం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అమలపై కత్తులతో దాడి చేశారు.
ఆమె తప్పించుకునే యత్నం చేసినా దుండగులు వెంటపడి హత్య చేసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అమల భర్త రామగల్ల రామస్వామి బ్యాంకు ఉద్యోగి అని సమాచారం. అమల భర్తతో గొడవ పడి విడిపోయి వచ్చి బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారు. అమలకు కొడుకు, కూతురు ఉన్నారని వారు తండ్రి వద్ద ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment