women murder case
-
తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి
మండ్య: జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల మృతదేహాల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. హతులెవరు, హంతకులెవరు అనేది పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ మరణాలపై సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన మండ్య జిల్లాలోని పాండవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బేబి గ్రామంలో ఉన్న చెరువులో సుమారు 30 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. మృతదేహానికి తల లేదు. మొండెం మాత్రమే ఉంది. ఇప్పటివరకు హతురాలు ఎవరో నిర్ధారణ కాలేదు. వివరాలను తెలిపిన వారికి రూ.లక్ష బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదేరోజు శ్రీరంగ పట్టణం తాలూకా అరికెరె పోలీస్ స్టేషన్ పరిధిలో సీడీఎస్ కాలువ వద్ద నీటి గుంతలో 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. ఆమెకు కూడా తల లేదు. ఇద్దరి దేహాలపై బట్టలు లేవు. ఈ మహిళ వివరాలు చెప్పినవారికి రూ.లక్ష నజరానాను ప్రకటించారు. చదవండి: (భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..) -
మహిళ హత్య.. ట్విటర్లో టీడీపీ అసత్య ప్రచారాలు
సాక్షి, కడప అర్బన్: మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితులను మైనర్లుగా గుర్తించారు. నిందితులను కడప బాలుర గృహంలోని పర్యవేక్షక గృహానికి పంపించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శనివారం విలేకరులకు వెల్లడించారు. ఈనెల 7న లింగాల పోలీసులకు పెద్దకుడాల సమీపంలోని గుట్టలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామంలో వారు విచారించగా ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన నాగమ్మ(45)దిగా గుర్తించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి స్వీయపర్యవేక్షణలో మరుసటి రోజునే మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ హత్యకు గురైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది. అప్పటికే హత్య కేసుగా నమోదు చేశారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?) ఈ హత్య చేసింది ఇద్దరు మైనర్లు అని తేలింది. వీరిలో ఒకరి వయసు 15, మరొకరికి 18 లోపు ఉంటుంది. వీరిద్దరే కాకుండా ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళ ఎలాంటి అత్యాచారానికి గురి కాలేదని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మకు 20 ఏళ్ల కిందట వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లికి చెందిన వ్యక్తితో వివాçహమైంది. రెండు నెలలు మాత్రమే కాపురం చేసి పుట్టింటికి వచ్చేసింది. మూడు నెలల తరువాత సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన వ్యక్తితో వివాహం కాగా తొమ్మిదేళ్ల తరువాత తల్లిదండ్రుల దగ్గరికే వచ్చేసింది. మేకలు మేపుకుంటూ, కొనుగోలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె తల్లి పుల్లమ్మ ఈనెల 7వ తేదీ రాత్రి 9 గంటలకు లింగాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన రెండో కుమార్తె నాగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ ఉదయం 9:30కి మేకలను తీసుకెళ్లి మేపుకుని సాయంత్రం 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తుందని, కానీ ఆరోజు రాకపోవడంతో తన కుమార్తెకు ఫోన్ చేయగా సమాధానం రాలేదని పేర్కొంది. గ్రామస్తులతో గుట్ట వద్దకు వెళ్లగా తన కుమార్తె తలకు రక్తగాయమై చనిపోయి ఉందని బాధ్యులైన వారిని శిక్షించాలని ఫిర్యాదులో తెలిపింది. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లలో ఒకరు తనను పెళ్లి చేసుకుంటావా? అని నాగమ్మను అడగ్గా చేసుకుంటానని సరదాగా చెప్పింది. చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం) మరుసటి రోజు వారు నాగమ్మ కంటే ముందే గుట్టకు చేరుకున్నారు. ఆమె రాగానే వీరిలో ఒకరు ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతడిని ఆమె వెనక్కి తోసే ప్రయత్నంలో తానే పడిపోయింది. భుజం ఎముక పక్కకి జరిగింది. బాధ తట్టుకోలేక కేకలు పెట్టింది. దీంతో భయపడిపోయిన నిందితులు నాగమ్మను రాళ్లతో కొట్టి చంపేశారు. తరువాత పారిపోయారు. పోలీసుల విచారణలో వీరి పాత్రను తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ విలేకరులకు వివరించారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ ఈ హత్య సంఘటనపై కొందరు అసత్యప్రచారాలను చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా ఊరుకునేది లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనవసరంగా తప్పుడు సమాచారంతో ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని ఆయన సూచించారు. టీడీపీ శ్రేణుల రాద్ధాంతం ట్విట్టర్లో అసత్య ప్రచారాలు సాక్షి, కడప అర్బన్: లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మ హత్య కేసును రాజకీయం చేసేందుకు టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేశారనే విమర్శలు వినవస్తున్నాయి. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించడమే గాక, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తప్పుడు సమాచారం చేరవేశారు. దీని ఆధారంగా చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం, ఆయన తనయుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని, పోలీసులను, విచారణను తప్పుపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. దీంతో టీడీపీ నేతల విమర్శల వెనుక ఉన్న దురుద్దేశం తేటతెల్లమైందని పలువురు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
‘కోరిక తీర్చలేదని చంపేశా’
సాక్షి, కృష్ణా జిల్లా : గుడివాడలో వారం రోజుల క్రితం జరిగిన మహిళ హత్యలో ముద్దాయి నంబూరి వెంకట రామరాజుని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 19న బర్రిలంక గరువు గ్రామానికి చెందిన కృపారాణిని దారుణంగా హత్య చేసి జమ్ము పొదలో పడేసి వెళ్లిపోయాడు. అనంతరం పోలీసులు రామరాజును పట్టుకొని విచారించగా, కృపారాణితో ఉన్న పాత పరిచయంతో తన కోరిక తీర్చమని అడగడంతో ఆమె నిరాకరించిందని, అందుకే హత్య చేశానని వెల్లడించాడు. -
ఏపీ దిశా చట్టం అభినందనీయం
దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు–2019కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి అభినందించారు. ‘‘దిశా’ చట్టం–2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. ‘దిశ’ ఘటన మనందర్నీ కలచివేసింది. ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం అందరిలో ఉంది. అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగు పడటం హర్షణీయం. సీఆర్పీసీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్)ని సవరించడం ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కవ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించే వీలు ఉంది. సోషల్ మీడియాలో మహిళల గౌరవాన్ని కించపరచడంలాంటివి చేస్తే ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ద్వారా తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్నవాళ్లలో భయం కల్పించే విధంగా చట్టం తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేక కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడం వల్ల మహిళాలోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని ఓ ప్రకటనలో చిరంజీవి వెల్లడించారు. -
మహిళ దారుణ హత్య మిస్టరీనే!?
‘దిశ’ హత్యాచారం ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోయింది. నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ అన్ని వర్గాలనుంచి వినిపించింది. సరిగ్గా అదే సమయంలో కామారెడ్డిలోనూ ఓ మహిళ హత్యోదంతం వెలుగుచూసింది. అయితే ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే ఉంది. సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో గతనెల 25న ఓ మహిళ మృతదేహం కనిపించింది. తల లేదు. మొండెం మాత్రమే ఉంది. అదీ కుళ్లిపోయి ఉంది. ఒంటిపైన జాకెట్ బట్ట తప్ప వేరే దుస్తులు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. 25 నుంచి 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ.. పది రోజుల క్రితమే హత్యాచారానికి గురై ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆధారాల కోసం సంఘటన స్థలంలో చుట్టుపక్కల వెతికారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించినా ప్రయోజనం లేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునేందుకుగాను టవర్ డంప్ ఏర్పాటు చేశారు. అయితే లక్షల ఫోన్ కాల్స్ ఉండడంతో విచారణలో అడ్డంకులు చోటు చేసుకున్నాయి. ఎక్కడో చంపి తలను వేరు చేసి, మొండాన్ని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. హతురాలు ఎవరో తెలిస్తేనే.. ఎంతటి నేరస్తుడయినా ఏదో ఒక తప్పు చేసి పోలీసులకు చిక్కుతుంటారు. చిన్న క్లూ దొరికినా పోలీసు విచారణ ముందుకు సాగుతుంది. అయి తే మహిళను హత్య చేసిన వ్యక్తులు.. ఆమె వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. హతురాలు ఎవరో తెలిస్తే పోలీసులకు దొరికిపోతామనే ఆలోచనలతో తల తీసేసి, బట్టలు, ఇతర వస్తువులు, ఆనవాళ్లు లేకుండా చేశారు. హత్యకు గురైన మహి ళ చేతివేళ్లను సైతం చెక్కినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు నమోదు కాకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఇది ఒకరితో సాధ్య మయ్యే పనికాదనీ, హంతకులు ఒకరికి మించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతు రాలి తలను సంఘటన స్థలానికి సమీపంలో ఐదు రోజుల తర్వాత గుర్తించారు. కానీ అప్పటికే కుళ్లిపోవడంతో ఎలాంటి వివరాలు తెలియ లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్న పోలీసులు.. మిస్సింగ్ కేసుల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. కామారెడ్డితో పాటు చు ట్టు పక్కల ప్రాంతాల్లో ఇటీవల అదృశ్యమైన మహి ళల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మగ్గురు మహిళల మిస్సింగ్ కేసులను పరిశీలించగా వారిలో ఇద్దరు మహిళల ఆచూకీ ఉన్నట్లుగా తెలిసింది. మరో మహిళ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, పాత కేసులను పరిశీలిస్తున్నారు. ఈ ‘దిశ’కు న్యాయం జరిగేదెప్పుడో? హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియకపోవడంతో హంతకులు ఎవరో కనుక్కోవడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసును జిల్లా పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పన్నెండు రోజులు గడిచినా సరైన ఆధారాలు లభించకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. షాద్‌నగర్‌లో ‘దిశ’పై క్రూరంగా లైంగిక దాడి చేసి హతమార్చిన సమయంలోనే కామారెడ్డి పెద్ద చెరువు మత్తడి వాగులో మహిళ మృతదేహం కనిపించింది. ఆ ఘటనలో బలైన ‘దిశ’ ఆత్మ శాంతించేలా నలుగురు నిందితులూ శుక్రవారం ఎన్కౌంటర్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం కేసు ముందుకు సాగడం లేదు. ఈ ‘దిశ’ ఆత్మ శాంతించేది ఎప్పుడో? చదవండి: హత్యకు గురైన మహిళ తల లభ్యం -
మహిళ దారుణహత్య
రామడుగు(చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్న రాగమల్ల అమల (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం హత్య చేసి పరారయ్యారు. సిద్దిపేట జిల్లాకేంద్రం సమీపంలోని పుల్లూరుకు చెందిన అమల రెండు నెలలక్రితం వెదిర గ్రామంలో బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అమలపై కత్తులతో దాడి చేశారు. ఆమె తప్పించుకునే యత్నం చేసినా దుండగులు వెంటపడి హత్య చేసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అమల భర్త రామగల్ల రామస్వామి బ్యాంకు ఉద్యోగి అని సమాచారం. అమల భర్తతో గొడవ పడి విడిపోయి వచ్చి బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారు. అమలకు కొడుకు, కూతురు ఉన్నారని వారు తండ్రి వద్ద ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
వివాహేతర సంబంధంతో మహిళ హత్య
తమిళనాడు ,టీ.నగర్: వివాహేతర సంబంధం కారణంగా మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. తూత్తుకుడి జిల్లా, తిరువైకుంఠం తాలూకా ఆళ్వార్తిరునగరి సమీపానగల ముదలైమొళి ఉత్తర వీథికి చెందిన మల్కియా (35), అదే ప్రాంతానికి చెందిన ముత్తుసామిని 17 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్ మాణిక్కరాజ్ (40) ముత్తుసామిని చూసేందుకు తరచుగా ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలో మాణిక్కరాజ్‌కు, మల్కియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన ముత్తుసామి భార్య మందలించాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇలావుండగా మల్కియా దీనిగురించి ప్రియుడు మాణిక్కరాజ్‌కు తెలిపింది. అతడి ప్లాన్ ప్రకారం ముత్తుసామిని హతమార్చేందుకు మల్కియా సమ్మతించింది. దీంతో గత 13 మే, 2014లో ముత్తుసామిని భార్య, ప్రియుడు హతమార్చారు. ఇరువురిని ఆళ్వార్తిరునగరి పోలీసులు అరెస్టు చేసి శ్రీవైకుంఠం కోర్టులో కేసు దాఖలు చేశారు. 2015లో మల్కియా ప్రియుడితోపాటు బెయిలుపై విడుదలయింది. దీంతో వీరిద్దరు కలిసి జీవించసాగారు. పళయకాయిలైలో ఒక కంపెనీలో మల్కియాకు ఉద్యోగం దొరికింది. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో మల్కియాకు మళ్లీ వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మాణిక్కరాజ్, మల్కియాల మధ్య గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి మల్కియా పనిముగించుకుని రోడ్డుపై ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడ పొంచివున్న మాణిక్కరాజ్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మెకానిక్ హత్య సత్యమంగళం సమీపంలో మంగళవారం మెకానిక్ హత్యకు గురయ్యాడు. సత్యమంగళం సమీపానగల మెట్టూర్ గ్రామానికి చెందిన ఆనందన్ కుమారుడు జగదీశ్వరన్ (30). ఇతడు సత్యమంగళం–కోవై జాతీయ రహదారిలోగల ఒక లారీ వర్కుషాపులో మెకానిక్‌గా ఉన్నాడు. ఇతడు బుధవారం ఉదయం వర్కుషాపు సమీపానగల రోడ్డులో శవంగా కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో సత్యమంగళం పోలీసులు విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వరన్ తల్లిదండ్రులు బంధువులు రోడ్డుపై భైఠాయించి ఆందోళన జరిపారు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో జగదీశ్వరన్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. టైలర్ హత్య తిరుపూర్‌లో మంగళవారం టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. పుదుచ్చేరి మెత్తపాక్కం మేట్టు వీథికి చెందిన కలియమూర్తి (48) తన కుమార్తె, కుమారుడితో తరుపూర్ విజయాపురం మహాలక్ష్మినగర్ రెండో వీధిలో నివశిస్తున్నాడు. కలియమూర్తికి మద్యం అలవాటు ఉంది. ఇతడు మంగళవారం ముత్తనంపాళయంలోగల మద్యం దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రాలేదు. స్మశానం చెట్టు కింద శవంగా లభించాడు. అతనిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. -
హత్య చేసి.. కాల్చేశారు
పట్టణ శివార్లలోని పంట పొలాల్లో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తలపై తీవ్ర గాయం చేసి హత్య చేసిన అగంతకులు ఆమెను కాల్చి బూడిద చేసేందుకు ప్రయత్నించారు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి ముందస్తు పథకం ప్రకారం ఈ హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మండపేట: మండపేట – ఆలమూరు రోడ్డు గొడ్డు కాలువ సమీపంలోని పుంత రోడ్డు దారిలో వివాహిత హత్య ఉదంతం పట్టణంలో సంచలనం సృష్టించింది. పొలాల్లో మృతదేహం భాగాలు ఉన్నట్టుగా స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై రాజేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం తల, చేతులు, కాళ్లు మినహా మిగిలిన శరీరమంతా కాలి బూడిదైంది. కాలి వేళ్లకు చుట్టులు ఉండటంతో మృతురాలు వివాహితని, వయసు 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన మూత.. కిరోసిన్ టిన్ మూతై ఉంటుందని, చాకు భాగం కూడా దొరికింది. మృతురాలు ఎవరనేది తెలియకుండా ఆమెను హత్య చేసి కాల్చివేసే ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో విషయం బయటపడింది. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు తల వెనుక భాగంలో, ఛాతిపై కత్తితో పొడిచిన తీవ్ర గాయాలు ఉండటాన్ని గుర్తించారు. ముందుగా హత్య చేసి తర్వాత దహనం చేసి ఉంటారని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హతురాలికి తెలిసిన వారే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని అంటున్నారు. రబీ సీజన్ ముగియడంతో రైతులు ఎక్కడికక్కడ పొలాల్లో గడ్డిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో, పొలాల్లో దహనం చేసినా ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని దహనం చేసేందుకు పట్టణ శివార్లలోని పొలాలను ఎంచుకుని ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. వివాహితను నమ్మించి ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోకి తీసుకువచ్చి ఈ ఘాతానికి పాల్పడ్డారా? లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పొలాల్లో తగలబెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో టిన్ మూత లభ్యం కావడం బట్టి మృతదేహాన్ని దహనం చేసేందుకు కిరోసిన్, లేదా పెట్రోల్ వంటి వాటిని వినియోగించవచ్చునని తెలుస్తోంది. పోస్టుమార్టం కోసం మృతదేహం భాగాలు పోస్టుమార్టం కోసం మృతదేహం భాగాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐస్ పెట్టెలో ఉంచారు. హతురాలి ఫొటోలను చుట్టుపక్కల పోలీస్స్టేషన్లకు పంపించి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పట్టణ సీఐ కె.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్‌కుమార్ అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 83329 57926కు సమాచారం తెలియజేయాలని ఎస్సై రాజేష్‌కుమార్ కోరారు. -
హత్యచేసి.. మూటగట్టి..
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండలంలోని గట్టెపల్లి గ్రామ ఊరచెరువులో 28 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుల్తానాబాద్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం..ఈజీఎస్ కూలీలు బహిర్భూమికి వెళ్లగా ముళ్లపొదలనుంచి దుర్వాసన రావడం గమనించారు. మరింత దగ్గరకు వెళ్లి చూడగా గన్నీ సంచిలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందిచగా..వారు సంఘటన స్థలానికి చేరుకొని ముళ్లపొదలో ఉన్న గన్నీ సంచిని పరిశీలించగా మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై నైటీ మాత్రమే ఉండగా, కాళ్లను ప్లాస్టర్‌తో చుట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. తల, ఇతర భాగాలపై రక్తపు మరకలున్నాయి. దుండగులు మూడురోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా గట్టెపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మృతదేహాన్ని చూశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, సోడా బాటిళ్లు ఉన్నాయి. మృతదేహం పడేసిన చోట కొంత దూరంలో వాహనం తిరిగి వెళ్లిన ఆధారాలున్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయగా ఘటనా స్థలంనుంచి కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. -
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
నూజివీడు: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద నల్లబెల్లి గ్రామానికి చెందిన పిల్లా కమలకు ఆరేళ్ల క్రితం క్రాంతి కుమార్‌తో వివాహమైంది. వీరిరువురికి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే మూడేళ్ల క్రితం భర్తను వదిలేసిన కమల అప్పటి నుంచి హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ఏరియాలో నివాసం ఉంటూ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఏడాది క్రితం కృష్ణాజిల్లా నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటకు చెందిన పామర్తి పూర్ణ శ్రీకాంత్, హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా ఫేస్బుక్ ద్వారా ఆమె పరిచయం ఏర్పడింది. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని, తనకు ఆస్తులున్నాయని, ఇంకా పెళ్లి కాలేదని పరిచయం చేసుకుంది. దీంతో శ్రీకాంత్ కూడా ఆమెకు దగ్గరై సహజీవనం చేశాడు. కమల సొంత ఊరుకి వెళ్తే.. గత సంక్రాంతి పండుగ సమయంలో కమల స్వగ్రామానికి ఇద్దరూ కలసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకు వివాహమైందని, భర్తను వదిలేయడమే కాకుండా కుమార్తె కూడా ఉందని శ్రీకాంత్‌కు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతడు ఆ తరువాత నుంచి ఆమెతో ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కమల రెండు సార్లు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వదిలిపెడితే ఊరుకోనని బెదిరించింది. వదిలించుకోవాలని.. రోజురోజుకు కమల వేధింపులు ఎక్కువవుతుండడంతో ఎలాగైనా వదిలించుకోవాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. తండ్రి పామర్తి శోభనబాబును సహకరించాలని కోరాడు. తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో శ్రీకాంత్ అమ్మమ్మగారి ఊరైన చాట్రాయి మండలం పర్వతాపురంలో దినం కార్యక్రమం ఉందని, వెళ్లివద్దామని నమ్మించి గతనెల 28 రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లో కమలను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. దారిలో కీసర వద్ద పెట్రోలు కోని సీసాలో నింపుకుని తీసుకుని మండలంలోని అన్నేరావుపేట రోడ్డులోకి తీసుకెళ్లి చున్నీతో మెడకాయకు చుట్టి గట్టిగా లాగి చంపేసి, రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి లాగి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నేరుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. దర్యాపులో నిజాలు.. కాలిన మృతదేహాన్ని తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కమల చేతికి ఉన్న వాచ్ తెల్లవారుజామున 3.50గంటలకు ఆగిపోయి ఉంది. అదే రోజు రాత్రి ఒంటి గంట వరకు వర్షం జల్లులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒంటి గంట నుంచి 3.50గంటల మ«ధ్యే ఘటన జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని గుర్తించారు. అలాగే చంపేయమని సలహా ఇచ్చిన నిందితుడి తండ్రి శోభన్‌బాబు, తల్లి పుణ్యవతిని నిందితులుగా కేసులో నిందితులుగా చేర్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును 36 గంటల్లోనే చేధించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు 15రోజులు రిమాండ్ విధించింది. విలేకరుల సమావేశంలో సీఐ మిద్దే గీతారామకృష్ణ, రూరల్, టౌన్ ఎస్ఐలు కే దుర్గాప్రసాదరావు, రంజిత్‌కుమార్, రూరల్ ఏఎస్ఐ రాధాకృష్ణరెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు
సాక్షి, గుంటూరు/గుంటూరు: సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న రాజధాని ప్రాంతం మంగళగిరి మండలం నవులూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశంలో అంగడి జ్యోతి (25) హత్యకు గురైన విషయం తెలిసిందే. జ్యోతి ప్రియుడు శ్రీనివాస్ ఈ హత్యకు పాల్పడినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. శ్రీనివాస్ వద్ద పనిచేసే పవన్ ఈ హత్యకు సహకరించాడన్నారు. జ్యోతి కేసులో ముద్దాయిలు చుంచు శ్రీనివాస్, కటారి పవన్‌కల్యాణ్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందని: చుంచు శ్రీనివాస్ రోడ్డు మరమ్మతుల కాంట్రాక్టు పనులు చేస్తుండేవాడు. అతను, అదే ప్రాంతానికి చెందిన అంగడి జ్యోతి ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జ్యోతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్ పెళ్లి విషయాన్ని దాటవేస్తున్నాడు. పెళ్లి విషయమై గట్టిగా అడగడం మొదలు పెట్టిన జ్యోతి.. తేడా చేస్తే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. ఏదో రకంగా జ్యోతి అడ్డు తొలగించుకోవాలని, ఈ విషయాలన్నీ తన వద్ద పనిచేసే కటారి పవన్‌కల్యాణ్‌కు చెప్పి తనకు సహాయం చేయాలని శ్రీనివాస్ కోరాడు. 11వ తేదీ మధ్యాహ్నం 12.30కు జ్యోతి తన సర్టిఫికెట్ల కోసం తాడేపల్లి నుంచి గుంటూరు చుట్టుగుంట ప్రియదర్శిని ఫార్మా కళాశాలకు వెళ్లి.. తాను గుంటూరుకు వచ్చినట్లు 1.21 గంటలకు శ్రీనివాస్‌కి ఫోన్ చేసింది. మంగళగిరిలో కలుసుకుందామని శ్రీనివాస్ చెప్పాడు. ఈ విషయం పవన్‌కు ముందే చెప్పిన శ్రీనివాస్ ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. పవన్ బైక్‌పై వచ్చిన శ్రీనివాస్.. జ్యోతిని మంగళగిరిలో కలుసుకున్న తదుపరి నెట్ సెంటర్లో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని యర్రబాలెం–నవులూరు గాంధీబొమ్మ సెంటర్లోని నూడిల్స్ పాయింట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లి.. పథకం ప్రకారం పవన్‌ను అక్కడికి రప్పించాడు. పవన్ తన చేతిలో ఉన్న రాడ్డుతో జ్యోతి తలపై గట్టిగా కొట్టాడు. అనంతరం దెబ్బ సరిగా తగిలిందో లేదోనని శ్రీనివాస్ కూడా ఆమె తలపై కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే చనిపోయింది. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు, చిత్రంలో నిందితులు అనుమానం రాకుండా..: అనుమానం రాకూడదని శ్రీనివాస్ తనకు యాక్సిడెంట్ అయిందని నాటకమాడాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించి జ్యోతిని తమతో పంపమని అడుగగా తాము అందుకు నిరాకరించామని, తమపై దాడి చేసి జ్యోతిని చంపారని శ్రీనివాస్ కట్టుకథ చెప్పాడు. హత్యకు గురైన జ్యోతితోనే కాకుండా శ్రీనివాస్ మరికొందరు యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడు. శ్రీనివాస్ సెల్ఫోన్లో యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలున్నాయి. ఫేస్బుక్లో 80 మందికి పైగా యువతులతో శ్రీనివాస్ చాటింగ్ చేశాడని ఎస్పీ వివరించారు. జ్యుడీషియల్ విచారణ జరిపించాలి జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. జ్యోతి తల్లిదండ్రులు అంగడి చిన్నగోవిందు, దుర్గ మాట్లాడుతూ తమ కుమార్తెను నమ్మించి మోసం చేసి దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నార్త్ డీఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించి పోస్టుమార్టం చేసేందుకు వచ్చిన వైద్యురాలిని అడ్డుకున్న కారణంగానే ఖననం చేసిన తమ కుమార్తె మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో తమకు పోలీస్ శాఖపైనే నమ్మకం సడలుతోందన్నారు. సంఘటన స్థలంలో తమ కుమార్తెకు చెందిన సెల్‌ఫోన్, పర్స్, చెప్పులు ఏమయ్యాయనే విషయాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. జుడీషియల్ విచారణకు ఆదేశిస్తే పూర్తి స్థాయిలో వివరాలు బహిర్గతమవుతాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కేసు ముగించే కుట్ర
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్యకేసులో అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వ వైద్యులు అనుసరించిన తీరు, కేసును నీరుగార్చే కుట్రలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో పోలీసులు జ్యోతి మృతదేహంపై దుస్తులు, వేలిముద్రలను సేకరించకుండా ఖననం చేయడం.. ఆ తరువాత దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు సేకరించడంతో అనుమానాలు వెల్లువెత్తగా రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో చీకటి కోణం వెలుగు చూసింది. సంచలనాత్మకమైన కేసులో పకడ్బందీగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించిన తీరు బయటపడింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జి.విజయభారతి జ్యోతి మృతదేహానికి అసలు పోస్టుమార్టమే నిర్వహించకుండా పొట్టపై చిన్న గాటు పెట్టి కుట్లు వేసి పంపించిన వైనం బయటపడడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. జ్యోతి తలపై రాడ్డు లాంటి ఆయుధంతో బలంగా కొట్టడం వల్లే ఆమె మృతిచెందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పోస్టుమార్టం సమయంలో మృతదేహం తలపై చిన్న గాటు కూడా పెట్టిన దాఖలాలు లేవంటే పోస్టుమార్టం ఏవిధంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి హత్య కేసులో ప్రభుత్వ వైద్యురాలు ఈ విధంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పులు కావని, కుట్రపూరితంగా కేసును పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం చేసినవనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ విజయభారతిపై చర్యలు షురూ.. జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయభారతిని రెండు రోజుల క్రితం పిలిపించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను సస్పెండ్ చేసి వదిలేస్తారా.. లేక క్రిమినల్ కేసు సైతం నమోదు చేస్తారా? అనే విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జ్యోతిని రాడ్డు లాంటి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టడం వల్ల తల లోపల పుర్రె ముక్కలు ముక్కలైనట్లు రీపోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. జ్యోతిది కేవలం హత్య మాత్రమేనని, ఆమెపై ఎటువంటి లైంగిక దాడులు జరగలేదని కూడా తేలినట్లు సమాచారం. స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చిన శ్రీనివాసరావు జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు ఏవిధంగా కుట్ర చేశాడనే వైనాన్ని పోలీసులు పూర్తిగా ఆధారాలతో సేకరించినట్లు తెలిసింది. అతని వద్ద పనిచేసే పవన్ పోలీసుల అదుపులో అసలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే పవన్ సహాయం తీసుకున్నాడా.. అసలు జ్యోతిని ఎలా హతమార్చారు.. శ్రీనివాసరావుకు తగిలిన గాయం ఎవరు చేశారు.. అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే శ్రీనివాసరావు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించకపోవడంతో ఆసుపత్రి నుంచి నేడో, రేపో డిశ్చార్జి చేసి అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అయితే రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించేందుకు అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ వైద్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచి చూడాలి. -
స్నేహితుని సాయంతో అంతం?
సాక్షి, గుంటూరు/ తాడేపల్లి రూరల్: అంగడి జ్యోతి హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈనెల 11న మంగళగిరి నవులూరు సమీపంలోని అమరావతి టౌన్షిప్లో అంగడి జ్యోతి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావు పాత్రపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి పోలీసులు శ్రీనివాసరావు స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. జ్యోతిని వదిలించుకునే ఆలోచనతో స్నేహితుల సాయంతో శ్రీనివాసరావే ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ యువకుడి బైక్ పైనే అమరావతి టౌన్‌షిప్‌కు.. తన బైక్ పైనే 11న జ్యోతిని శ్రీనివాసరావు అమరావతి టౌన్‌షిప్‌కు తీసుకువెళ్లినట్టు శ్రీనివాసరావు స్నేహితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి పెళ్లి విషయంలో శ్రీనివాస్, జ్యోతిల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. పెళ్లి చేసుకోవాలని జ్యోతి తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో ఆమెకు సంబంధించిన అసభ్యకర ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని శ్రీనివాసరావు జ్యోతిని బెదిరించేవాడని, అయినా సరే జ్యోతి పెళ్లి గురించి ఒత్తిడి చేసేదని అతను చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్ ఆమెను నమ్మించి అమరావతి టౌన్‌షిప్‌కు రప్పించాడని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. తాడేపల్లి పరిధిలోని మహానాడు ప్రాంతంలో నివసించే ఇద్దరు యువకులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఓ యువకుడు శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే హత్య చేశామని ఒప్పుకొన్నట్లు సమాచారం. తాను జ్యోతితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వెనుకనుంచి వచ్చి దాడికి పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు అతని స్నేహితుడు పోలీసులకు వెల్లడించాడని సమాచారం. ముందుగా తనపై రాడ్‌తో దాడిచేసి, అనంతరం జ్యోతిపై దాడి చేయాలన్న శ్రీనివాసరావు ప్రణాళిక ప్రకారమే చేశామని, అనంతరం ఆ రాడ్‌ను బకింగ్‌హామ్ కెనాల్లో పడవేశామని అతను చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తాడేపల్లి పరిధిలోని సీతానగరం, కొత్తూరు రైల్వే బ్రిడ్జి కింద భాగంలో బకింగ్‌హామ్ కెనాల్ లాకులు మూయించిన ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా గజ ఈతగాళ్లతో గాలించారు. అయినా రాడ్డు లభించలేదు. కాగా కేసు దర్యాప్తులో కీలక ఆధారాలైన జ్యోతి సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగ్‌ల జాడ నేటికీ లభించలేదు. -
ప్రియుడే హంతకుడా?
మంగళగిరి: రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్య కేసులో పోలీసులు మిస్టరీని దాదాపు ఛేదించినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా కేసు పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే జ్యోతిని ప్రియుడు శ్రీనివాసరావు హత్య చేసి ఉంటాడా? అన్న కోణంలో విచారణను వేగవంతం చేశారు. శ్రీనివాసరావు వ్యవహార శైలిని తీవ్రంగా అనుమానిస్తున్న పోలీసులు, ఇప్పటికే అతని ఫోన్ నుంచి కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై పలు విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయరావు, ఉమన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత, అర్బన్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ హరిరాజేంద్రబాబులు జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావును ఎన్నారై ఆసుపత్రిలో విచారించారు. అలాగే సీసీ పుటేజ్, కాల్ డేటా ఆధారంగా పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. హత్య జరిగినప్పటి నుంచి ఇంతవరకూ శ్రీనివాసరావు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే అతనే జ్యోతిని హత్యచేసి ఉండవచ్చా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. ఈ హత్య జరిగిన తీరు పలు అనుమానాలకు తావిచ్చినప్పటికీ ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారో తేల్చడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు మృతదేహంపై ఉన్న బట్టలు, వేలిముద్రల్ని సేకరించకుండానే ఖననం చేయడం, ఆ తర్వాత పోలీసులు దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి బట్టలు సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు వేసిన అధికారులు నార్త్ డీఎస్పీ రామకృష్ణను సైతం కేసు విచారణ నుంచి తప్పించారు. శ్రీనివాసరావు సెల్ఫోన్లో కీలక ఆధారాలు ఈనెల 11న మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో శ్రీనివాసరావు, జ్యోతిలపై దాడి జరగ్గా.. జ్యోతి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శ్రీనివాసరావు అనారోగ్యం పేరుతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడని, అపస్మారకస్థితిలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదంటూ నాలుగు రోజులుగా పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. 14వ తేదీ మధ్యాహ్నం ఐసీయూ నుంచి వార్డుకు మార్చగానే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అతన్ని విచారించారు. ప్రియుడు శ్రీనివాసరావును పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకుంటానని స్నేహితులతో చెప్పిన ఆడియో రికార్డుల్ని పోలీసులు సేకరించడంతో పాటు శ్రీనివాసరావు సెల్ఫోన్లో జ్యోతితో పాటు, పలువురు యువతుల అసభ్యకర ఫొటోలు, వీడియోల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పలువురు యువతులతో శ్రీనివాసరావు చేసిన చాటింగ్‌లు కూడా దొరికాయని చెబుతున్నారు. వీటిన్నంటిని విశ్లేషించాక అతనే జ్యోతిని హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. స్నేహితుల సాయంతో తనను గాయపర్చుకుని హత్య చేశాడా? అనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. పోలీసు అధికారులు మాత్రం శ్రీనివాసరావే చంపాడన్న విషయాన్ని నిర్ధారించడం లేదు. విచారణ పూర్తయ్యాక మాత్రమే అసలు నిందితులు ఎవరనేది తేలుతుందని, ప్రస్తుతం అతనిపై అనుమానాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. డాక్టర్ భారతిపై చర్యలు! జ్యోతి హత్య కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటుపడగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ భారతిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జ్యోతి మృతదేహానికి మొదట పోస్టుమార్టం నిర్వహించిన భారతిని కలెక్టర్ కోన శశిధర్ పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసే సమయంలో తప్పులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టును సైతం కలెక్టర్ తెప్పించుకున్నారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించండి: శ్రీనివాసరావు తల్లిదండ్రులు తమ కుమారుడు శ్రీనివాసరావు నేరస్తుడు కాదని, నేరం చేసి ఉంటే చట్టపరంగా శిక్షించవచ్చని శ్రీనివాసరావు తల్లి లక్ష్మి, తండ్రి నరసింహారావు అన్నారు. ఆసుపత్రి ఆవరణలో శ్రీనివాసరావు తల్లి లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. నిందితులెవరైనా ఉరితీయాలని తెలిపింది. జ్యోతి కుటుంబసభ్యుల వల్ల తమతో పాటు తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. జ్యోతిని హత్య చేసేంతటి నేరం తమ కుమారుడు చేస్తాడని అనుకోవడం లేదని నరసింహరావు చెప్పారు. -
నిజాలు ‘కప్పెట్టారు’..!
సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్ (మంగళగిరి): ‘రాజధానిలో జ్యోతి హత్య’ కేసులో పోలీసులు నిజాలు కప్పిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? రాజధానిలో మహిళలకు భద్రత లేదనే చెడ్డపేరు రాకుండా చూసుకునే క్రమంలో కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒకసారి ఖననం చేశాక మృతదేహాన్ని బయటకు తీయాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. అయితే మండల మెజిస్ట్రేట్ కూడా లేకుండా దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు, వాచ్ స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఈ కేసులో ఏదో దాచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన యువతి హత్య కేసులో పోలీసులు, పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యురాలు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. మంగళగిరి మండలం నవులూరు సమీపంలో అమరావతి టౌన్ షిప్లో ఈ నెల 11 రాత్రి ప్రేమ జంటపై గుర్తు తెలియని అగంతకులు దాడి చేసిన ఘటనలో అంగడి జ్యోతి (25) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియుడు శ్రీనివాసరావు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది ఎవరనే విషయం మిస్టరీగా మారడంతో మూడు రోజుల్లో ఛేదిస్తామంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావు ప్రకటించారు. అయితే ఖననం చేసిన యువతి మృతదేహాన్ని బుధవారం అత్యంత గోప్యంగా బయటకు తీసి ఒంటిపై దుస్తులు, వాచీని సేకరించారనే విషయం బయటపడడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్య అనంతరం పోలీసులు ఏం చేయాలి.. ఏం చేశారు? రాజధానిలో యువతి హత్యకు గురికావడం సంచలనం కలిగించిన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు జరపాల్సి ఉంది. అయితే యువతి మృతదేహంపై దుస్తులు, వాచీ, వేలిముద్రలు సేకరించకుండా ఖననం చేసేవరకు పోలీసులు చోద్యం చూశారు. బుధవారం యువతి సోదరుడు ప్రభాకర్‌ను పిలిచి మృతదేహాన్ని బయటకు తీసి దుస్తులు, వస్తువులు తమకు అప్పగించాలంటూ ఒత్తిడి చేశారు. కాటికాపరి పద్మ, మృతదేహాన్ని పూడ్చినవారిని పిలిపించి దొంగచాటుగా మృతదేహాన్ని బయటకు తీసి దుస్తులు, వాచీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మీడియాకు చెప్పవద్దంటూ తమను బెదిరించారని, చివరకు తమనే కేసులో ఇరికించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ యువతి అన్న ప్రభాకర్, ఇతర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము యువతి మృతదేహంపై దుస్తులను తొలగించిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించామని, పోస్టుమార్టం పూర్తి అయ్యాక మళ్లీ దుస్తులు తొడిగి పోలీసులకు అప్పగించామని మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ భారతి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా జ్యోతి మృతదేహంపై హత్య జరిగినప్పుడు ఉన్న దుస్తులను తొలగించి, ఓ నైటీని తీసుకువెళ్లి కప్పినట్లు కాటికాపరి గల్లా పద్మ చెప్పింది. అయితే మృతదేహాన్ని బయటకు తీసి, దుస్తులను సేకరించామనడం వాస్తవం కాదని మంగళగిరి రూరల్ సీఐ బాలాజీ పేర్కొన్నారు. తాము జ్యోతి మృతదేహాన్ని వెలికితీయించలేదని, ఎవరు తీశారో తమకు తెలియదని అన్నారు. బంధువుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు యువతిని హత్య చేసిన కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ మృతురాలు జ్యోతి బంధువులు, గిరిజన సంఘ నాయకులు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ముట్టడించి ఆందోళనకు దిగారు. కేసును పక్కదారి పట్టించడానికే ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి, ఆధారాల పేరుతో దుస్తులు, చేతివాచీని పోలీసులు తీసుకున్నారని మృతురాలు జ్యోతి అన్న ప్రభాకర్ ఆరోపించాడు. తాము కొందరి పేర్లు చెప్పి వారిపై అనుమానం వ్యక్తం చేసినా ఇంతవరకు వారిని అదుపులోకి తీసుకోలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని, కేసును పక్కదోవ పట్టిస్తున్న సీఐని సస్పెండ్ చేయాలని, జిల్లా జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఉన్నారని తెలుసుకున్న బంధువులు, గిరిజన నాయకులు అర్ధనగ్నంగా బైఠాయించి జ్యోతిని మభ్యపెట్టి హత్య చేసిన శ్రీనివాసరావును చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన జ్యోతి కుటుంబసభ్యులు, గిరిజన నేతలతో చర్చించారు. జ్యోతి మృతదేహంపై దుస్తులు తీయలేదని స్పష్టం చేశారు. బంధువుల సమక్షంలో రీపోస్టుమార్టం చేయించి, వీడియో తీయించి కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్‌కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అత్తాపూర్ మహిళల హత్య కేసులో పురోగతి
-
డబ్బుల కోసమే హత్య
తూప్రాన్ : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత నెల 28న ఓ గుర్తుతెలియని మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌పోన్ ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(45) గత నెల 28న శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురవగా మృతదేహం లభించిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గురైన మహిళ వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. హత్యకు గురైన చంద్రకళ ఆటోడ్రైవర్లు, తెలిసిన వ్యక్తుల వద్ద విచ్చలవిడిగా తిరిగే మహిళ అని అన్నారు. ఇదే క్రమంలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవితో పరిచయం ఉన్న చంద్రకళకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రూప్సింగ్(70) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను మచ్చిక చేసుకొని గతంలో పలుమార్లు చంద్రకళతో సహవాసం చేసినట్లు తెలిపారు. గత నెల 27న చంద్రకళకు ఫోన్ చేసి నర్సాపూర్‌కు రప్పించారు. అక్కడి నుంచి రవి ఆటోలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చంద్రకళను తీసుకువచ్చారు. అనంతరం రవి ఆటోలో వెళ్లిపోగా నిందితుడు రూప్సింగ్ చంద్రకళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది చంద్రకళను హత్య చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసి మృతురాలి వద్ద డబ్బులు, నగల కోసం వెతికగా ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి రూప్సింగ్ వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా హంతకుడు రూప్‌సింగ్‌ను గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు పాత నేరస్తుడే చంద్రకళను హత్య చేసిన నిందితుడు పాత నేరస్తుడని డీఎస్పీ చెప్పారు. 1998 సంవత్సరంలో వర్గల్ మండలం నాచారంలో ఓ మహిళ హత్య కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే తన సొంత అత్తను 2010లో హత్య చేసిన కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ లింగేశ్వర్‌రావు, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, స్థానిక ఎస్సై శేఖర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డి, సిబ్బంది మంగ్యానాయక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
అశ్వరావుపేట: ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం మోడల్ కాలనీకి చెందిన మహరున్నిసా(30) అనే మహిళ ఈ నెల 4న దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్న వ్యక్తే.. ఓ భూవివాదం విషయంలో ఆమెను హత్య చేయించాడని తెలియడంతో.. హత్య చేసిన కిరాయి హంతకుడు మస్తాన్ తో పాటు సహకరించిన గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.