ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా జిల్లా : గుడివాడలో వారం రోజుల క్రితం జరిగిన మహిళ హత్యలో ముద్దాయి నంబూరి వెంకట రామరాజుని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 19న బర్రిలంక గరువు గ్రామానికి చెందిన కృపారాణిని దారుణంగా హత్య చేసి జమ్ము పొదలో పడేసి వెళ్లిపోయాడు. అనంతరం పోలీసులు రామరాజును పట్టుకొని విచారించగా, కృపారాణితో ఉన్న పాత పరిచయంతో తన కోరిక తీర్చమని అడగడంతో ఆమె నిరాకరించిందని, అందుకే హత్య చేశానని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment