విజయవాడ : చంద్రబాబు రెండేళ్ల పాలనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో పి.మధు మాట్లాడుతూ... చంద్రబాబు తన రెండేళ్లపాలనలో 79 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించారని ఆరోపించారు. విభజన సమయానికి రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉందని.. వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగం, ఉపాధి, అధిక ధరలపై జులై 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వివరించారు.