పాకాల జిల్లా ఏర్పాటు చేయాలి | pakala district should be formed | Sakshi
Sakshi News home page

పాకాల జిల్లా ఏర్పాటు చేయాలి

Published Thu, Sep 8 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

pakala district should be formed

  • టీవీవీ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌
  • నేడు నర్సంపేట బంద్‌
  • నర్సంపేట : నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని అంబటి శ్రీనివాస్, తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి జగదీశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గాన్ని కలపడాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గెనె యువరాజు, అక్కపెల్లి రమేష్, లావుడ్య రాజు, ఎర్ర యాకుబ్‌రెడ్డి, షేక్‌ జావిద్, ప్రణయ్‌దీప్, విజయ్, కందికట్ల వీరేష్‌ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటను పాకాల జిల్లాగా ప్రకటించాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ జాతీయ కార్యదర్శి తేజావత్‌ వాసునాయక్‌ డిమాండ్‌ చేశారు. ఇంకా నర్సంపేటను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు సాంబరాతి మల్లేశం కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement