పాలేరు..క‘న్నీరు’ | Paleru kanneru | Sakshi
Sakshi News home page

పాలేరు..క‘న్నీరు’

Published Mon, Aug 22 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

నీళ్లులేక మైదానాన్ని తలపిస్తున్న జలాశయం

నీళ్లులేక మైదానాన్ని తలపిస్తున్న జలాశయం

పాలేరు రిజర్వాయర్‌ కన్నీరు పెడుతోంది. జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఆదివారం నాటికి ఏడడుగులకు చేరింది. ఎప్పుడూ సాగర్‌ జలాలతో నిండే రిజర్వాయర్‌ ఈ ఖరీఫ్‌లో నీరు విడుదల కాకపోవడం.. ఉన్ననీరు తాగునీటి అవసరాలకు వినియోగించడంతో అడుగంటింది. మరో రెండురోజులు పోతే తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. మొదటి జోన్‌ వరకు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ జోన్‌ చివరన ఉన్న రిజర్వాయర్‌కు ఊరట లభించనుంది. మంత్రి తుమ్మల స్పందించి రిజర్వాయర్‌ అడుగంటకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – కూసుమంచి

Advertisement
Advertisement