పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
Published Mon, Aug 1 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
నిడమనూరు : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంచాయితీ తీర్మానాలకు వేదిక మారుతోంది. పాఠశాలకు సెలవు ఉంటేచాలు ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుంటారు. పాఠశాల ఎదురుగానే పోలీస్‌స్టేషన్ ఉండడంతో దీనిని వేదికగా వినియోగించుకుంటున్నారు. వచ్చిన వారు మల, మూత్రాలు పాఠశాల ఆవరణలోనే విసర్జిస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. దీంతో తెల్లారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. పాఠశాల ప్రహరీ గోడకు అక్రమంగా దారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులు, ఇతరులు పాఠశాల ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి ఇతరులు పాఠశాల ఆవరణలో పంచాయితీలు పెట్టి.. అపరిశుభ్రంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Advertisement