nidamanur
-
ప్రేమ పేరుతో వంచన.. పిల్లలు పుడితే ఒప్పుకుంటారని చెప్పి
సాక్షి, నల్గొండ: ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ కూతురుతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం ఆందోళన చేసింది. బాధితురాలి కథనం మేరకు.. నిడమనూరు మండలం మాడ్గులపల్లికి చెందిన దర్శనం బేబీరాణి మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కారింగుల శ్రీనుతో 2012లో పరిచయం ఏర్పడింది. బేబీరాణి 2015లో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుండగా అక్కడే విద్యాసంస్థలో పీఈటీగా పనిచేస్తున్న శ్రీను ఆమెను కలిసాడు. ప్రేమ విషయం తెలిసి 2016లో నిడమనూరులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా శ్రీను ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. శ్రీను 2018లో బేబీరాణిని ఒప్పించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోవడం లేదని, పిల్లలు పుడితే వాళ్లే ఒప్పుకుంటారని నమ్మించాడు. దీంతో బేబీరాణి 2020లో పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి శ్రీను తనకు ముఖం చాటేసి రెండో పెళ్లి చేసుకున్నాడని బేబీరాణి వాపోయింది. చదవండి: 65 ఏళ్ల వృద్ధుడి కిరాతకం..మాయమాటలు చెప్పి.. లోబర్చుకుని.. తనకు న్యాయం చే యాలని కోరుతూ బంధువులతో కలిసి శ్రీను ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు వివరించింది. కాగా, ఆ సమయంలో శ్రీను, అతడి తండ్రి ఇంట్లో లేరు. తన కుమారుడికి బేబీరాణితో ఎలాంటి సంబంధం లేదని శ్రీను తల్లి తెలిపింది. విషయం పోలీసులకు తెలపడంతో ఏఎస్ఐ జోజి వచ్చి పోలీస్‌స్టేషన్‌లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో బేబీరాణి ఆందోళన విరమించింది. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి -
జర్నలిస్టుల ధర్నా
నిడమనూరు : పుష్కర ఘాట్ల వద్ద పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం సాగర్ పైలాన్ కాలనీలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన పీఆర్వో వాహనాన్ని అడ్డగించారనే కారణంతో పోలీసులు ప్రదర్శించిన తీరుకు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రోడ్డుపై బైటాయించారు. అర్ధగంటసేపు ఆందోళన చేయడంతో పోలీస్‌పరేడ్‌గ్రౌండ్స్ వద్ద అటు, ఇటు వామనాలు నిలిచిపోయాయి. డీఎస్పీ, సీఐలు పరుగున వచ్చి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. విలేకరులను చిన్న చూపు చూస్తున్నారని, మంత్రి చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఇలా జరుగడం దారుణమన్నారు. వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఆందోళనలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు. -
స్పీడ్ బ్రేకర్లను మరిచారా..?
సందర్భంగా మిర్యాలగూడ–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిని మరమ్మతులు చేయడంతోపాటు డివైడర్లకు, కల్వర్టులకు రంగులు వేశారు. కానీ ప్రమాదకరంగా మారిన స్పీడ్‌బ్రేకర్లను మాత్రం మరిచి పోయారు. స్పీడు బ్రేకర్లు ఉన్నట్లుగా ఎక్కడా ఒక్క సూచికబోర్డుకు ఏర్పాటు చేయలేదు. దీంతో సాగర్–మిర్యాలగూడ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి మీదుగా దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సమీపంలోకి వచ్చే వరకు స్పీడు బ్రేకర్ ఉన్నట్లు తెలియక తమ వాహనాలను సడెన్‌గా బ్రేక్‌లు వేసి ఆపే క్రమంలో ముప్పుపొంచి ఉంది. ఇదే క్రమంలో వెనకాల వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివే గతంలోనే పలు ప్రమాదాలు జరిగినా ఆర్అండ్బీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై స్పీడు బ్రేకర్లు ఉన్నట్టు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడు బ్రేకర్లకు రంగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
నిడమనూరు : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంచాయితీ తీర్మానాలకు వేదిక మారుతోంది. పాఠశాలకు సెలవు ఉంటేచాలు ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుంటారు. పాఠశాల ఎదురుగానే పోలీస్‌స్టేషన్ ఉండడంతో దీనిని వేదికగా వినియోగించుకుంటున్నారు. వచ్చిన వారు మల, మూత్రాలు పాఠశాల ఆవరణలోనే విసర్జిస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. దీంతో తెల్లారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. పాఠశాల ప్రహరీ గోడకు అక్రమంగా దారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులు, ఇతరులు పాఠశాల ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి ఇతరులు పాఠశాల ఆవరణలో పంచాయితీలు పెట్టి.. అపరిశుభ్రంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
పంచాయితీ తీర్మానాలకు నిలయంగా ప్రభుత్వ స్కూల్
నిడమనూరు : మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంచాయితీ తీర్మానాలకు వేదిక మారుతోంది. పాఠశాలకు సెలవు ఉంటేచాలు ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుంటారు. పాఠశాల ఎదురుగానే పోలీస్‌స్టేషన్ ఉండడంతో దీనిని వేదికగా వినియోగించుకుంటున్నారు. వచ్చిన వారు మల, మూత్రాలు పాఠశాల ఆవరణలోనే విసర్జిస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. దీంతో తెల్లారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. పాఠశాల ప్రహరీ గోడకు అక్రమంగా దారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులు, ఇతరులు పాఠశాల ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి ఇతరులు పాఠశాల ఆవరణలో పంచాయితీలు పెట్టి.. అపరిశుభ్రంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
కేసీఆర్ 20ఏళ్ల క్రితమే సీఎం కావాల్సింది : జడ్జి
నిడమనూరు : తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టడానికి కేసీఆర్ 20ఏళ్ల క్రితమే సీఎం ఐతే బాగుండేదని నిడమనూరు మున్సిఫ్‌కోర్టు జడ్జి పద్మజ అన్నారు. నిడమనూరులోని ఆదర్శపాఠశాలలో బుధవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి పద్మజ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం 20ఏళ్ల క్రితమే చేపడితే ఎంతో బాగుండేదని, కేసీఆర్ సీఎం కావడంతో ఇప్పుడు చేపట్టాడని అన్నారు. తల్లిదండ్రుల, గురువుల సూచనల, అభిప్రాయాల మేరకు విద్యార్థులు నడుచుకుని ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి బాధ్యతగా ఒక మొక్క సంరక్షణ ఇవ్వాలని, ఆమేరకు ఉపాధ్యాయులు రికార్డు మెయింటెనెన్స్ చేయాలన్నారు. సమావేశం అనంతరం జడ్జి పద్మజతో పాటు నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు జడ్జికి, ప్రజాప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు. ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్ రంజిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ దాసరి నర్సింహ, వైఎస్ ఎంపీపీ మంజుల సీతారాములు, ఎంపీడీఓ ఇందిర, ఏపీఓ సత్యనారాయణ, ఎస్ఐ నర్సింహరాజు, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, ఎంఈఓ బాలునాయక్, ఉన్నం చిన వీరయ్య పాల్గొన్నారు.