టీఆర్ఎస్లోకి టీడీపీ అధికార ప్రతినిధి | party spoke person potla nageswara rao gives shock to TDP Party | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లోకి టీడీపీ అధికార ప్రతినిధి

Published Sun, Feb 14 2016 4:49 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీఆర్ఎస్లోకి టీడీపీ అధికార ప్రతినిధి - Sakshi

టీఆర్ఎస్లోకి టీడీపీ అధికార ప్రతినిధి

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా సైకిల్ దిగి.. కారు ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్లో చేరనున్నట్లు పోట్ల నాగేశ్వరరావు ఆదివారమిక్కడ ప్రకటించారు.  మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మంతనాలు జరిగిన అనంతరం పోట్ల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్పై ప్రకటన చేశారు.

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పటిష్టమైన నాయకత్వాన్ని టీడీపీ తయారు చేయలేకపోయిందని, అందుకు నిదర్శనం గ్రేటర్ ఎన్నికల ఫలితాలేనని పోట్ల వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement