వైభవోపేతం.. పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నిత్యపూజ, కలశ స్నపనం, ద్వారాతోరణ పూజ, మండల ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ హోమం నిర్వహించారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంధ్ర మహాదేశికన్ ఆధ్యర్యంలో వేద పండితులు పూజలు జరిపారు.