పింఛన్ల పంపిణీలో జిల్లా నాలుగో స్థానం | pensions distributions fourth place | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో జిల్లా నాలుగో స్థానం

Published Thu, Aug 11 2016 11:16 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

pensions distributions fourth place

ప్రత్తిపాడు :
రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్లను పంపిణీలో తూర్పు గోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉందని డీఆర్‌డీఏ ఏపీడీ ఎన్‌.సోమేశ్వరరావు తెలిపారు. కృష్ణా, చిత్తూరు, కర్నూలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో జరిగిన పింఛన్ల పంపిణీ పై గురువారం పరిశీలన జరిపారు. స్మార్ట్‌ సర్వే మూలంగా ప్రతి నెలా ఐదో తేదీ నాటికి పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్‌ విఫలమైన లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని సోమేశ్వరరావు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement