అదే వరుస!
► ఏటీఎంల ముందు బారులు తీరిన జనం
► చిల్లర కోసం తంటాలు
► మార్కెట్‌లు వెలవెల
► నిర్మాణరంగం కుదేలు
కరీంనగర్ : జనానికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి పన్నెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఇబ్బందులు దూరం కాలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో పనిచేసిన ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. శనివారం సాయంత్రం వరకే చాలా ఏటీఎంలలో డబ్బులు నిండుకున్నారుు. కేవలం ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ ఏటీఎంలలోనే డబ్బులు రాగా.. ఉదయం నుంచే జనం క్యూకట్టారు. దీంతో మధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యారుు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం సెంటర్లు నగరంలో ఎక్కడ కనిపించలేదు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొందరు దళారులు అక్రమదందాకు తెరలేపారు. రూ.లక్ష పాత కరెన్సీకి రూ.70 వేలు చెల్లిస్తున్నట్లు జిల్లా కేంద్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మార్కెట్ వెలవెల
నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని మార్కెట్‌తోపాటు టవర్‌సర్కిల్, శాస్త్రీరోడ్, గంజ్, కోర్టు చౌరస్తా, తదితర ప్రాంతాలు జనసంచారం లేక బోసిపోయారుు. రూ.500, రూ.వెరుు్య నోట్లు చెల్లకపోవడం రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు పేర్కొన్నారు. నిర్మాణరంగం కుదేలైంది. ఇప్పటికే కిరాణావ్యాపారులు సగానికిపైగా పడిపోగా..వ్యవసాయ, దినసరి కూలీలు పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వద్ద ఉన్న పత్తి, వరి ధాన్యాలను విక్రరుుంచినప్పటికీ, వ్యాపారులు డబ్బులు చెల్లించకుండా వారుుదా వేస్తున్నారు. దీంతో రైతులు పత్తి సేకరించిన కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు.
నల్లకుబేరుల్లో వణుకు
వివాహ, శుభకార్యాలున్న వారి ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు. డిసెంబర్ 30 తర్వాత లాకర్లు తెరిపించి, నల్లధనం బయటకు తీస్తామన్న ప్రధాని ప్రకటనతో బెంబేలెత్తిపోతున్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సుల్లో రూ.500 నోట్లు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.