Difficulties in retail
-
రూ.500 నోట్లు వచ్చాయోచ్!
► చెన్నైకు విమానంలో రూ. 320 కోట్లు ►చిల్లర నాణేలు కూడా ►కష్టం కొంతైనా తీరేనా? సాక్షి, చెన్నై: చిలర్ల కష్టాలు కొంతైనా తీరేనా..! అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగారుు. ఇందుకు తగ్గట్టుగా శనివారం చెన్నైకు విమానంలో రూ. 500 కొత్త నోట్ల రూ. 320 కోట్ల మే రకు వచ్చి చేరారుు. అలాగే, సేలంకు రూ. కోటి విలువగల రూ.5, రూ.10 నాణేలు వచ్చారుు. రాష్ట్రంలో ఒకటో తేదీ నుంచి చిల్లర సమస్య మరింత జఠిలంగా మారిన విషయం తెలిసిందే. ఏటీఎంలకు వెళ్లినా, బ్యాంకులకు వెళ్లినా రూ. 2వేల నోట్లే ఇస్తుండడంతో చిల్లర సమస్య మరింతగా పెరిగింది. ఏ షాపునకు వెళ్లినా చిల్లర దొరకని దృష్ట్యా, జనం పాట్లు అంతా, ఇంతా కాదు.ఈ కొరతను అధిగమించేందుకు రూ. ఐదు వందల నోట్లు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూపుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాసిక్ నుంచి విమానంలో చెన్నైకు ఐదు వందల నోట్లు వచ్చి చేరారుు. ఉదయాన్నే మీనంబాక్కం విమానాశ్రయం కార్గోకు ఈ నోట్లు చేరుకున్నారుు. రిజర్వు బ్యాంక్ వర్గాలు, పోలీసు యంత్రాంగం నిఘా నడుమ నాలుగు కంటైనర్లలోకి నోట్ల కట్టలతో ఉన్న బాక్సుల్ని చేర్చారు. అక్కడి నుంచి గట్టి భద్రత నడుమ రిజర్వు బ్యాంక్ కార్యాలయానికి తరలించారు. అన్ని ఏటీఎంలలో పొందు పరిచేందుకు, బ్యాంకుల్లో పంపిణీ నిమిత్తం తరలించేందుకు రిజర్వు బ్యాంక్ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారుు. సోమవారం రూ. ఐదు వందల కొత్త నోట్లు జనం చేతికి చేరే అవకాశాలు ఉన్నారుు. సేలంకు రూ. కోటి విలువగల రూ. ఐదు, రూ.పది నాణేలను తరలించారు. అక్కడి బ్యాంక్‌లకు ఈ చిల్లరను గట్టి భద్రత నడుమ చేర్చారు. రిజర్వు బ్యాంక్ నిబంధనల్ని ఉల్లంఘించి బ్యాంకులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు బయలు దేరారుు. గృహ, వాహన రుణాలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేసే పనిలో పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నారుు. ఇక, శనివారం కూడా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంల వద్ద జనం బారులు తీరక తప్పలేదు. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఆందోళనలు సాగారుు. మన్నార్ కుడికి చెందిన రైతు అశోకన్(55) బ్యాంకు కూలీ. నిలబడి నిరసించి సృ్పహ తప్పాడు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. -
అదే వరుస!
► ఏటీఎంల ముందు బారులు తీరిన జనం ► చిల్లర కోసం తంటాలు ► మార్కెట్లు వెలవెల ► నిర్మాణరంగం కుదేలు కరీంనగర్ : జనానికి చిల్లర కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి పన్నెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఇబ్బందులు దూరం కాలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో పనిచేసిన ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. శనివారం సాయంత్రం వరకే చాలా ఏటీఎంలలో డబ్బులు నిండుకున్నారుు. కేవలం ఎస్బీహెచ్, ఎస్బీఐ ఏటీఎంలలోనే డబ్బులు రాగా.. ఉదయం నుంచే జనం క్యూకట్టారు. దీంతో మధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యారుు. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం సెంటర్లు నగరంలో ఎక్కడ కనిపించలేదు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొందరు దళారులు అక్రమదందాకు తెరలేపారు. రూ.లక్ష పాత కరెన్సీకి రూ.70 వేలు చెల్లిస్తున్నట్లు జిల్లా కేంద్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్కెట్ వెలవెల నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని మార్కెట్‌తోపాటు టవర్‌సర్కిల్, శాస్త్రీరోడ్, గంజ్, కోర్టు చౌరస్తా, తదితర ప్రాంతాలు జనసంచారం లేక బోసిపోయారుు. రూ.500, రూ.వెరుు్య నోట్లు చెల్లకపోవడం రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు పేర్కొన్నారు. నిర్మాణరంగం కుదేలైంది. ఇప్పటికే కిరాణావ్యాపారులు సగానికిపైగా పడిపోగా..వ్యవసాయ, దినసరి కూలీలు పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వద్ద ఉన్న పత్తి, వరి ధాన్యాలను విక్రరుుంచినప్పటికీ, వ్యాపారులు డబ్బులు చెల్లించకుండా వారుుదా వేస్తున్నారు. దీంతో రైతులు పత్తి సేకరించిన కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. నల్లకుబేరుల్లో వణుకు వివాహ, శుభకార్యాలున్న వారి ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు. డిసెంబర్ 30 తర్వాత లాకర్లు తెరిపించి, నల్లధనం బయటకు తీస్తామన్న ప్రధాని ప్రకటనతో బెంబేలెత్తిపోతున్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సుల్లో రూ.500 నోట్లు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.