పెట్రోల బంక్‌ల బంద్
-
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే విక్రయాలు
నెల్లూరు(పొగతోట):
అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో ఆయిల్ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. 2010లో కమిటీ సిఫార్సులు చేసింది. కమిటీ సిఫార్సులను ఇప్పటి వరకు అమలు చేయలేదు. డీలర్ల కమిషన్ పెంపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చేసిదిలేక పెట్రోలు బంక్‌ల డీలర్లు సమ్మెకు దిగారు. ప్రస్తుతం గురు, శుక్రవారాలు పెట్రోలు, డిజిల్ సరఫరా చేసే డిపోలు నుంచి డీలర్లు కొనుగోళ్లను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో డిపోల నుంచి జిల్లాలకు పెట్రోలు, డీజిల్ సరఫరా కాదు. ప్రస్తుతం ఉన్న పెట్రోలు, డీజిల్‌తో పెట్రోలు బంకులు పని చేస్తున్నాయి. చిన్న బంక్‌లు ఇప్పటికే ముతపడ్డాయి. జిల్లాలో 280 పెట్రోలు బంకులు ఉన్నాయి. నిత్యం 4 లక్షల లీటర్ల పెట్రోలు, 6 లక్షల డిజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నుంచి సుమారు 50 శాతంకు పైగా పెట్రోలు బంక్‌లు ముతపడే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీ నుంచి పెట్రోలు బంక్‌ల డీలర్లు సమ్మె చేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విక్రయాలు సాగనున్నాయని పెట్రోలు డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌చౌదరి తెలిపారు. ముంబయ్‌లో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు ఉన్నాయి అవి సఫలమైతే యథావిధిగా విక్రయాలు కొనుసాగిస్తామన్నారు.