వధూవరులకు పసుపుకుంకుమ, కొత్తబట్టలు ఇచ్చి ఆశీర్వదిస్తున్న దశ్యం
కొత్తవలస: ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలనే సదుద్దేశంతో కొత్తవలస మేజరుపంచాయతీ మాజీ సర్పంచ్ మామిడి సరయ్యశెట్టి ఇంటివద్ద శనివారం జరిగిన పెండ్లివేడుకలలో పోలీసులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పోలీస్‌దుస్తులలో హెచ్‌సీ ఎ.రెహమాన్ కానిస్టేబుల్ జి.రమేష్ పెండ్లివద్దకు వెళ్లి పూసర్ల సత్యనారాయణ,రామేశ్వరి దంపతులకు కొత్తబట్టలతోపాటు పసుపుకుంకుమ ఇచ్చి పోలీస్‌శాఖ తరఫున ఆశీర్వదించారు. పోలీస్‌దుస్తులతో పెళ్లివద్దకు వెళ్లడంతో పోలీసులువస్తున్నారని కంగారు పడినా తరువాత పోలీసుల తీరును పెళ్లివారందరూ ప్రశంసించారు.