ఆలస్యంగా ప్రారంభమైన పోలీస్‌ ఈవెంట్స్‌ | Police delayed the start of the events | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా ప్రారంభమైన పోలీస్‌ ఈవెంట్స్‌

Published Thu, Jul 28 2016 1:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Police delayed the start of the events

నల్లగొండ క్రైం :  వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో బుధవారం పోలీస్‌ కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌ ఆలస్యగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈవెంట్స్‌ను 8 గంటలకు ప్రారంభించారు. మంగళవా రం రాత్రి వర్షం పడడంతో గ్రౌండ్‌లో నీళ్లు నిలిచాయి. దీంతో పోలీసులు అభ్యర్థులు రన్నింగ్‌ చేసేందుకు అనుకూలంగా నేలను మట్టిపోసి చదును చేశారు. ఎస్పీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి ప్రతి ఈవెంట్‌లో పాల్గొనే అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయించారు. అభ్యర్థులను టెంట్ల కింద కూర్చోబెట్టి సర్టిఫికెట్లను పరిశీలించారు. 900మంది అభ్యర్థులకు ఈవెంట్స్‌ను పూర్తి చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement