తిరుపతి క్రైమ్: శేషాచలం అడవుల్లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఈతగుంట ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై మంగళవారం రాత్రి సుమారు 100 మంది ఎర్రచందనం కూలీలు దాడికి యత్నించారు. రాళ్లు రువ్వి దాడికి యత్నించడంతో మూడు బృందాలుగా ఉన్న (ఒక్కో బృందంలో 17 మంది) టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూలీలపై కాల్పులు ప్రారంభించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.