ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ
ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ
Published Thu, Sep 15 2016 11:45 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
కలిగిరి : తహసీల్దార్, వీఆర్వోల స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసుపై ఎస్సై ఎస్‌కే ఖాధర్‌బాష ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్ రవీంద్రనాథ్‌ను కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మార్తులవారిపాలెంకు చెందిన మూలి పెంచలయ్య వీఆర్వో స్టాంపు, సంతకాలు ఫోర్జరీ చేసి కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రుణాలు పొందడానికి ప్రయత్నించాడరన్నారు. ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ మేనేజర్ ప్రదీప్ ఈ విషయాన్ని గుర్తించారన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాలతో రుణాల పొందడానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు అధికారుల స్టాంపులు తయారుచేసిన వారిపై, సంతాకాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ సూత్రదారులను వెలుగులోకి తీసుకువస్తామన్నారు.
Advertisement
Advertisement