రైతుపై పోలీస్ జులుం
Published Sat, Dec 17 2016 12:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కోసిగి : మండల పరిధిలోని కందుకూరు సిండికేట్ బ్యాంక్ వద్ద నోట్ల కోసం క్యూలో వేచి ఉన్న కామన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఈడిగ మానయ్య అనే రైతు పై ఓ పోలీసు జులుం ప్రదర్శించాడు. ఇష్టానుసారంగా చితకబాదాడు. వివరాలు రైతు మాటల్లోనే..‘‘ ఇటీవల పొలంలో సాగుచేకున్న పత్తిని మార్కెట్‌లో అమ్మగా రూ.24వేల చెక్కు వచ్చింది. దానిని బ్యాంక్ జమ చేసి.. నగదు తీసుకుందామని శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు వెళ్లి బ్యాంక్ వద్ద పాసు పుస్తకం పెట్టి క్యూలో వేచి ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పోలీసు లాఠీతో కాళ్లకు కొట్టాడు. దీంతో కాలుకు తీవ్ర గాయమైంది. పనులు మానుకుని బ్యాంక్‌ల వద్ద నోట్ల కోసం క్యూలో ఉన్న సామాన్య ఖాతదారులను పోలీసు కొట్టడడమేటి’’ అని ఆ రైతు ప్రశ్నించారు.
Advertisement