ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు
ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు
Published Wed, Jul 20 2016 11:50 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
వరంగల్ : వరంగల్ జిల్లాలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి.
సోమవారం రాత్రి కురిసిన భా రీ వర్షం కారణంగా మంగళవారం జేఎన్‌ఎస్ స్టేడియం లో నిలిచిపోయిన పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.
కేయూ మైదానంలో 950 మంది హాజరు...
వరంగల్ రూరల్ జిల్లా పోలీసు పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు కాకతీయ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం 950 మందికి పరుగుపందెం నిర్వహించారు. సోమవారం రాత్రి వర్షం పడినప్పటికీ రన్నింగ్ ట్రాక్ పొడిగా మారడంతో అధికారులు అ భ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు క్రీడాం శా ల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝూ మైదానంలో పర్యవేక్షించా రు. ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటీ, డీఎస్పీలు రాజామహేంద్రనాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, రాంచందర్‌రావు పాల్గొన్నారు.
జేఎన్‌ఎస్‌లో....
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో ఆరవ రోజు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. మంగళవారం నిర్వహించిన 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు బుధవారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన, శారీరక కొలతలతోపాటు 100 మీటర్ల పరుగు, హైజం ప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ అంశాల్లో అభ్యర్థులకు పరీక్ష లు నిర్వహించారు. బుధవారం 1,452 మంది అభ్యర్థు లు 800 మీటర్ల పరుగుల పందెం అర్హత పరీక్షలు హాజ రయ్యారు. అదేవిధంగా 216 మంది మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, లాంగ్‌జం ప్ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీ శోభన్‌కుమార్, జనార్దన్, మహేం దర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వరరావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు అనుమతి
వరంగల్ : పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో డిప్లొమా, ఐటీఐ చదువుకున్న వారిని క్రీడాంశాల పరీక్షలకు అనుమతించడం లేదు. ఐదురోజులుగా సాగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హత గురైన అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి పోలీసు రిక్రూట్‌మెంట్ చైర్మన్ పూర్ణచందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాలని వరంగల్ సిటీ పొలీసు కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌తోపాటు డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులను కూడా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని పూర్ణచందర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు రోజుల నుంచి పోటీకి అనుమతించని డిప్లొ మా అభ్యర్థులను గురువారం నుంచి పోటీలు నిర్వహిస్తామని సీపీ, రూరల్ ఎస్పీలు తెలిపారు.
Advertisement
Advertisement