భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌ | Constable Assassinate His Wife At Warangal In Telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 7 2020 11:17 AM | Last Updated on Sun, Jun 7 2020 11:18 AM

Constable Assassinate His Wife At Warangal In Telangana - Sakshi

ఖిలా వరంగల్‌: ఓ కానిస్టేబుల్‌ తన భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన ఖిలా వరంగల్‌ మండలం మామునూరులోని టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌లో శనివారం రాత్రి వెలుగు చూసింది. ఖిలా వరంగల్‌ మండలం తిమ్మాపురం గ్రామం పెన్షన్‌పురం కాలనీకి చెందిన సివిల్‌ కానిస్టేబుల్‌ అయూబ్‌ఖాన్‌(40) జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య తస్లీమా సుల్తానా(35)తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన ఎంజీఎం ఆస్పత్రిలో కోర్టు డ్యూటీ చేస్తున్నాడు. శనివారం ఉదయం ఆయూబ్‌ ఖాన్‌ పెన్షన్‌పురం రహదారులపై కత్తి చేతులో పట్టుకుని వీరంగం సృష్టించాడు. టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ ప్రహరీ దూకి హల్‌చల్‌ చేయగా అధికారులు పట్టుకుని మామునూరు పోలీసులకు అప్పగించారు. (నీళ్లు అనుకుని శానిటైజర్‌ తాగి..)

మధ్యాహ్నం వరకు పోలీసుస్టేషన్‌లో ఉన్న అయూబ్‌ఖాన్‌ను భార్య తస్లీమా సుల్తానాతో పాటు బంధువులు విడిపించారు. ఇంటికి వచ్చే క్రమంలో భార్యను బైక్‌పై తీసుకుని బయలుదేరిన అయూబ్‌ బెటాలియన్‌ ప్రధాన గేట్‌ నుంచి లోపలికి వెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు. పురాతన క్వార్టర్‌ వద్ద భార్య తస్లీమా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాడు. సాయంత్రం మళ్లీ రోడ్డుపైకి వచ్చిన ఆయన భార్యను హత్య చేశానని చెబుతూ బెటాలియన్‌ గోడ దూకి లోనకు ప్రవేశించాడు. దీంతో సిబ్బంది మామునూరు పోలీసులకు తెలియజేయగా వారు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా తన భార్యను హత్య చేశానని, పురాతన క్వార్టర్లలో మృతదేహం ఉందని చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు, సిబ్బందితో కలిసి రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. (కుక్క‌ను బైకుకు క‌ట్టి, కి.మీ లాక్కెళ్లి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement