నేనున్నానంటూ చేయి అందించింది..! | A constable washed away in the flood in warangal | Sakshi
Sakshi News home page

నేనున్నానంటూ చేయి అందించింది..!

Published Sat, Aug 19 2017 6:09 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

నేనున్నానంటూ చేయి అందించింది..! - Sakshi

నేనున్నానంటూ చేయి అందించింది..!

వరంగల్: వరదలో చిక్కుకున్నామంటే జీవితం మీద ఆశలు లేనట్లే. కానీ వరదలో కొట్టుకుపోయిన ఓ కానిస్టేబుల్ అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఇంకా వరదలోనే ఉన్నాడు. కొట్టుకుని పోతున్న అతనికి ఒక చెట్టు నేనున్నానంటూ చేయి అందించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మల్లెల నాగేశ్వరరావు గుండెపోటుతో చనిపోయిన మంగపేట ఏఎస్సై సారయ్య అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి బయలుదేరాడు.

ఆయన ములుగు మండలం పంచోత్కులపల్లి సమీపంలో వాగు వరదలో చిక్కుకుని కొంత దూరం కొట్టుకుపోయాడు. అయితే ఆ చెట్టును ఆసరాగా చేసుకుని సురక్షితంగా బయటపడ్డాడు.  వరదలో చిక్కుకున్న అతను రక్షించాలంటూ అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement