పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
Published Wed, May 31 2017 4:32 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పదో తరగతి విద్యార్హతతో నేరుగా సాంకేతిక విద్యాభ్యాసానికి అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి గాను పాలిసెట్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు పనిచేస్తాయి. ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనకు అనుగుణంగా సిబ్బందిని నియమించి, కంప్యూటర్ సిస్టమ్‌లను సిద్ధం చేశారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి ఒంటి గంట, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
ఉండాల్సిన ధ్రువపత్రాలు
ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, ఆధార్ కార్డు, 4 నుంచి 10 తరగతుల వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా రెసిడెన్సియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల ధ్రువపత్రం, ఎన్‌సీసీ/స్పోర్ట్స్/మైనార్టీ/ఆంగ్లో ఇండియన్ ధ్రువపత్రాలు, ర్యాంకు కార్డు ఒరిజినల్స్‌తో పాటు వాటి జెరాక్స్ కాపీలు తీసుకు రావాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు
ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరు ఎక్కడికి వెళ్లాలి?
దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ల ఉన్న వారు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి కేటాయించిన తేదీల ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతరులు వారికి సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు తేదీల వారిగా కేటాయించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.
Advertisement