టీఆర్ఎస్ తోనే చెరువుల అభివృద్ధి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
ప్రతే ్యక రాష్ట్రం వచ్చిన తర్వాతే తెలంగాణలోని చెరువులు పూడికతీతకు నోచుకుంటున్నాయి. చెరువు మట్టిని ప్రతి ఒక్క రైతూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 1,192 చెరువుల్లో పూడికతీతకు మిషన్ కాకతీయ కింద నిధులు మంజూరు చేశాం.
పెద్దేముల్ : ప్రతే ్యక రాష్ట్రం వచ్చిన తరువాతనే తెలంగాణలోని చెరువులు పూడికతీతకు నోచుకుంటున్నాయని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఊర చెరువులో రూ. 66లక్షలతో చేపట్టే మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా పూడికతీతకు నోచుకోని చెరువులు, కుంటలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే మోక్షం లభిస్తోందని తెలి పారు. చెరువు మట్టిని ప్రతి ఒక్క రైతూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చెరువుల్లో పూడిక తీయడం వల్ల వర్షాలు సకాలంలో కురిస్తే ఆయకట్టు కింద సుమారు రెండు పంటలను తీసేందుకు అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 1,192 చెరువుల్లో పూడిక తీతకు మిషన్ కాకతీయ కింద నిధులు మంజురు చేయడం జరిగిందన్నారు. పెద్దేముల్ మండలంలో 39 చెరువులకు రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. తాండూరు నుంచి తొర్మామిడి రోడ్డు అభివృద్ధికి రూ.27 కోట్లు, రూ.80 కోట్లతో తాండూరు రింగ్ రోడ్డు ఏర్పాటుకు సర్వే పూర్తి చేయడం జరిగిందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మమ్మ, ఎంపీపీ వాణీశ్రీ, జెడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ విద్యాసాగర్, తహసీల్దార్ గంగాధర్, ఇరిగేషన్ ఏఈ నికేష్, మండల నాయకులు నరసింహులు, ఇందూరు ప్రకాష్, మొగులప్ప, బాలప్ప, అన్వర్, అంజిల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గెమ్యానాయక్, కిషన్‌రావ్‌తో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
యాలాల, పెద్దేముల్‌లలో గురుకులాలు
తాండూరు : యాలాలలో రూ.18 కోట్లతో బీసీ గురుకుల బాలుర, పెద్దేముల్‌లో రూ.10 కోట్లతో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని బస్‌స్టేషన్లను అభివృద్ధి పర్చడం, లేదా కొత్తవి ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల కోటా నుంచి రూ.10లక్షల నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. నాపరాతి పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సర్వే కొనసాగుతోందని, వచ్చే నెలనాటికి ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ సాజిద్, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్లు, రజాక్, ఆసిఫ్, జెడ్పీటీసీ రవిగౌడ్, ఎంపీపీ సాయిల్‌గౌడ్, నాయకులు కరుణం పురుషోత్తంరావు, రవూఫ్ పాల్గొన్నారు.