హద్దులు దాటిన రైతులు | ponds lands aqufiy | Sakshi
Sakshi News home page

హద్దులు దాటిన రైతులు

Published Thu, Aug 11 2016 6:03 PM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM

హద్దులు దాటిన రైతులు - Sakshi

హద్దులు దాటిన రైతులు

  • చెరువు శిఖం కబ్జా
  • పట్టించుకోని అధికారులు
  •  నిలిచిన మిషన్‌కాకతీయ పనులు 
  • తిమ్మాపూర్‌: చెరువులను అభివృద్ధి చేయాలని, చెరువు శిఖం కబ్జాలకు గురికాకుండా హద్దులు నిర్ణయించి ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాని పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చెరువులకు హద్దులు గుర్తించకపోవడంతో, రైతులు ఆ భూమిల్ని సాగు చేస్తున్నారు. దీంతో మిషన్‌కాకతీయ పనులు నిలిచిపోతున్నాయి. అల్గునూర్‌లో బైరేనికుంటలో గ్రామానికి చెందిన రైతులు నాట్లు వేయడంతో మిషన్‌కాకతీయ పనులు నిలిచిపోయాయి. మిషన్‌కాకతీయ పనులు నిలిచిపోయిన అంశాన్ని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఖం కబ్జాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రాలు సైతం అందజేశారు. 
     టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పిలుపు మేరకు బైరేనికుంటను అభివద్ధి చేసేందుకు అల్గునూర్‌కు చెందిన రత్నాకర్‌రెడ్డి దత్తత తీసుకున్నాడు. అధికారులు హద్దులు నిర్ణయిస్తే అభివద్ధి పనులు చేపడాతామని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. చెరువు అభివద్ధికి డిపాజిట్‌ చేయాలని అధికారులు కోరగా రత్నాకర్‌రెడ్డి పనులు ప్రారంభించలేదు. 
    మిషన్‌కాకతీయలో రూ 18లక్షల మంజూరు
    మిషన్‌కాకతీయలో భాగంగా 35ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ బైరేనికుంట అభివద్ధికి ప్రభుత్వం రూ.18లక్షలు కేటాయించింది. చెరువు అభివద్ధి పనులను రత్నాకర్‌రెడ్డి దక్కించుకున్నాడు. 289 సర్వే నంబర్‌లోని 15ఎకరాల 25 గుంటల శిఖంకు సంబంధించి రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి కందకాలు తవ్వించిన అనంతరం కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. శిఖంలో ప్రస్తుతం సుమారు ఆరు ఎకరాల స్థలంలో రైతులు దున్ని పొలం వేశారు. కందకాలు తవ్వినా లెక్కచేయకుండా శిఖంను సాగు చేశారు. వ్యవసాయ బావి తవ్వి, విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకొని మరీ రైతులు సాగుచేస్తున్నారు. ఇది అక్రమమైనప్పటికీ విద్యుత్‌ అధికారులు సైతం విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించాలని రెవెన్యూ అధికారులు విద్యుత్‌ అధికారులుకు తెలిపినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.
     
    నిలచిన మిషన్‌కాకతీయ పనులు
    శిఖంలోసాగు చేస్తుండడంతో మిషన్‌కాకతీయ పనులు నిలిచిపోయాయి. పనులు పూర్తి చేయడానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ లోగా పంటలు పూర్తయ్యే పరిస్థితి లేదు. పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కాంట్రాక్టర్‌ అందోళన వ్యక్తం చేస్తున్నాడు. చెరువులో సగం వరకు పనులు పూర్తి చేశామని పొలాలు ఉన్న స్థలంలోనే పనులు చేయాల్సి ఉందని కాంట్రాక్టర్‌ చెబుతున్నాడు. పనుల కోసం మిషనరీ సైతం చెరువువద్దే ఉంచమని వాటి నిర్వహణ ఇబ్బంది అవుతోందని వాపోతున్నారు. శిఖం కబ్జాను అరికట్టి కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. స్థానిక నాయకులే ఈ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
    హద్దులు నిర్ణయించాం..
    తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి
    మిషన్‌కాకతీయ అధికారులకు హద్దులు నిర్ణయించి స్థలాన్ని అప్పగించాం. వారే పని చేయించుకోవాలి. పొలం దున్నకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. శిఖం కబ్జాకు గురైనట్లు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement