
స్ఫూర్తి ప్రదాత..సావిత్రిబాయి పూలే
ఘనంగా పూలే జయంతి వేడుకలు.
సిరిసిల్ల టౌన్ : బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే భావితరాలకు స్ఫూర్తి ప్రధాతగా ప్రజల మదిలో నిలిచారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపెల్లి రమేశ్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కేక్‌కట్ చేసి మాట్లాడారు. జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, యూత్‌విభాగం అధ్యక్షుడు సామల రాజుగౌడ్, ఏలూరు చంద్రకాంత్, శ్రీరాం వెంకటేశం, కాసర్ల రాజు, గాజుల విద్యాసాగర్, యెనగంటి ఆంజనేయులు, కారంపురి సాయన్న తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్ల ో పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చాకలి రమేశ్, వేములవాడ ఇన్ చార్జి పొత్తూరి మల్లేశం, పట్టణ అద్యక్షుడు టి.భాను, దుంపేట జలేందర్, మేర్గు రాజు, జింక రాజు, గొల్లపెల్లి దావీదు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో యంగ్‌మెన్ప్ అంబేద్కరిస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఆకునూరి శంకరయ్య, అసోసియేషన చైర్మన్ సిరిగిరి కిషోర్, పట్టణ అద్యక్షుడు సిరిగిరి అనీల్‌కుమార్, ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పట్టణంలో స్వీట్లు పంపిణీ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సాయికుమార్, లచ్చన్న, రాకేశ్, అరుణ్, నాగరాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.