పసిపిల్లల రక్షణపై త్వరలో పాప్‌ గీతం | pop song soon on childrens protection | Sakshi
Sakshi News home page

పసిపిల్లల రక్షణపై త్వరలో పాప్‌ గీతం

Published Wed, Nov 16 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

పసిపిల్లల రక్షణపై త్వరలో పాప్‌ గీతం

పసిపిల్లల రక్షణపై త్వరలో పాప్‌ గీతం

కర్నూలు : నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెయ్‌... చెయ్‌.. నేత్రదానం... అంటూ పాప్‌ సాంగ్‌ పాడిన ఎస్పీ ఆకే రవికృష్ణ తనలోని కళను మరోసారి ఆవిష్కరించేందుకు ఆల్బమ్‌ రూపొందిస్తున్నారు. 'సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌' పేరుతో బాలికలు బరువు కాదు.. రక్షించండి.. చదివించండి.. అంటూ పాప్‌ గీతం పాడి ఆడియో, వీడియో రూపంలో విడుదల చేయనున్నారు. ఇటీవల కాలంలో కుప్ప తొట్లు, మురుగు కాల్వలు, రోడ్లపైనే పసిపిల్లల మృతదేహాలు అనేకం వెలుగు చూశాయి. వాటికి స్పందించిన ఎస్పీ ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఎస్పీ స్వీయ రచన చేశారు. ఈ ఆల్బమ్‌కు డైరక్టర్‌గా శశిధర్‌రెడ్డి, పాతబస్తీకి చెందిన ఫయూమ్‌ సంగీత దర్శకుడు. కూతురు కుమారి దీక్షిత కూడా ఎస్పీతో పాప్‌ గీతంలో గొంతు కలిపింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఎస్పీ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఆల్బమ్‌ను ఆవిష్కరించనున​‍్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement