pop song
-
మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ బ్యాన్
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ను బాలలపై లైంగిక దాడులు చేసేవారనే ఆరోపణలు న్నప్పటికీ మరణానంతరం ఆయన వేధింపుల పర్వం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని 12కుపైగా రేడియో స్టేషన్లు ఆయన పాప్ గీతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయించాయి. మైఖేల్ జాక్సన్ పాప్ గీతాలను తొలగిస్తున్నట్టు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా తదితర దేశాలు వెల్లడించాయి. మరణించి ఇన్నేళ్ళయినా చిన్న పిల్లలపై అతను చేసిన దుర్మార్గాల పర్వం మైఖేల్ జాక్సన్‌ను మరింతగా వెంటాడుతోంది. పాప్ గీతాల తొలగింపునకు తోడు బ్రిటిష్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియం నుంచి మైఖేల్ జాన్సన్ మైనపు బొమ్మను తొలగింస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మైఖేల్ జాక్సన్ పాప్సింగర్గా ఒకవెలుగు వెలుగుతున్న క్రమంలో పిల్లలను లైంగికంగా వేధించేవాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జిమ్మీ సెఫ్ చక్ (41), వేడ్ రాబ్సన్ (36) లు తమ పదేళ్ళు, ఏడేళ్ళ వయస్సులో మైఖేల్ తమ పట్ల దారుణంగా, చెప్పలేని విధంగా ప్రవర్తించేవాడని, నెవర్లాండ్ ఎస్టేట్‌లో తాము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తమ లాంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ సంచలనం సృష్టించారు. ఈ కథనాన్ని బ్రిటన్‌లోని ఓ ఛానల్ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. మైఖేల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇది విని షాక్ తిన్నారు. ఆ మధ్య అతని ఎస్టేట్ లో పని చేసిన ఓ మహిళ కూడా అతని నిర్వాకాన్ని బహిరంగ పర్చిన సంగతి తెలిసిందే. తను చూసిన దృశ్యాలను ఎవరికైనా చెబితే తన గొంతు కోస్తామని, అక్కడి ఉద్యోగులు తనను బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేయడం గమనార్హం. -
సృష్టికి మూలం మహిళ
– సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో ఎస్పీ గానం – రెండు నిమిషాల 50 సెకన్ల నిడివితో పాట – ఎస్పీ సతీమణి చేతుల మీదుగా సీడీ, వీడియోలు ఆవిష్కరణ కర్నూలు: ఆడపిల్ల పట్ల వివక్షతను విడనాడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. బేటీ బచావో.. బేటీ పడావో (ఆడపిల్లలను రక్షించండి.. ఆడపిల్లలను చదివించండి) అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో 'సేవ్ గర్ల్ చైల్డ్' అనే పాటను స్వీయ రచనతో ఎస్పీ పాడారు. గురువారం కర్నూలు నగరం పాతబస్తీలోని జమ్మిచెట్టు దగ్గర గల వైకుంఠ క్షేత్రం(శ్మశాన వాటిక)కు వెళ్లి గతంలో చెత్తకుప్పల్లో, ముళ్లకంపల్లో వదిలిపెట్టి పోయిన ఆడపిల్లల సమాధుల దగ్గర పూజలతో శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని, మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 'సేవ్ గర్ల్ చైల్డ్' అనే పాట ఆడియో, వీడియోల రూపంలో సీడీలను ఎస్పీ సతీమణి ఆకే పార్వతి దేవి చేతుల మీదుగా విడుదల చేశారు. 'చెత్తకుప్పలో నువ్వే... ముళ్లకంపలో నువ్వే... మురికి కాల్వలో నువ్వే... ఆడపిల్లగా కడుపున పడటమే నువ్వు చేసిన నేరమా... సేవ్ గర్ల్ చైల్డ్' అనే ఈ పాటను యూ ట్యూబ్, ఫేస్‌బుక్‌లలో పొందుపరిచారు. ఎక్కడ కూడా ఆడ పిల్లలను రోడ్డుపై వేయకూడదని, ఆడపిల్లను పెంచలేమని అనుకుంటే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్, ఐసీడీఎస్, చైల్డ్ లైన్ 1098కి సమాచారం అందించాలన్నారు. ఆడపిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. ఎస్పీ కుమార్తె ఆకే దీక్షిత, కర్నూలు స్టూడియోస్ డైరెక్టర్, ఎడిటర్ డి.ఎన్.శశిధర్‌రెడ్డి, రికార్డింగ్ స్టూడియో ఫయూమ్, సెవెన్ స్టార్ స్టూడియో, సంగీత దర్శకులు ఫయూమ్, మోసిస్, సంగీత పర్యవేక్షణ సండ శ్రీనివాస్, కెమెరామెన్ వి.ఎస్.రాఘవేంద్ర, కర్నూలు స్టూడియో టీమ్ జుబేర్ అన్సారీ, కలీమ్ షేక్, శరణ్ తదితరులు సేవ్ గర్ల్ చైల్డ్ పాట రూపకల్పనలో శ్రమించారని, వారందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్బీ డీఎస్పీ బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, తానా సభ్యుడు పొట్లూరు రవి, ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
పసిపిల్లల రక్షణపై త్వరలో పాప్ గీతం
కర్నూలు : నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెయ్... చెయ్.. నేత్రదానం... అంటూ పాప్ సాంగ్ పాడిన ఎస్పీ ఆకే రవికృష్ణ తనలోని కళను మరోసారి ఆవిష్కరించేందుకు ఆల్బమ్ రూపొందిస్తున్నారు. 'సేవ్ గర్ల్ చైల్డ్' పేరుతో బాలికలు బరువు కాదు.. రక్షించండి.. చదివించండి.. అంటూ పాప్ గీతం పాడి ఆడియో, వీడియో రూపంలో విడుదల చేయనున్నారు. ఇటీవల కాలంలో కుప్ప తొట్లు, మురుగు కాల్వలు, రోడ్లపైనే పసిపిల్లల మృతదేహాలు అనేకం వెలుగు చూశాయి. వాటికి స్పందించిన ఎస్పీ ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఎస్పీ స్వీయ రచన చేశారు. ఈ ఆల్బమ్‌కు డైరక్టర్‌గా శశిధర్‌రెడ్డి, పాతబస్తీకి చెందిన ఫయూమ్ సంగీత దర్శకుడు. కూతురు కుమారి దీక్షిత కూడా ఎస్పీతో పాప్ గీతంలో గొంతు కలిపింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఎస్పీ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఆల్బమ్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.