-
నెలకు రూ.3.53 కోట్ల భారం
-
పరిశ్రమలపై మరో రూ.2.21 కోట్ల బాదుడు
-
200 యూనిట్ల తర్వాత యూనిట్ ధర రూ.7
సాక్షి, రాజమహేంద్రవరం :
సాధారణంగా వేసవిలోనే గృహ విద్యుత్ వాడకం అధికంగా ఉంటుంది. సరిగ్గా ఇదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఈ నెల నుంచే అమలులోకి వచ్చాయి. మన జిల్లాలో వేసవి వాతావరణం ఇతర జిల్లాల కన్నా భిన్నంగా ఉంటుంది. గోదావరిలో ప్రవాహం తగ్గి ఇసుక తిన్నెలు బయటపడడం.. సముద్రతీరం కావడంతో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వేడి అధికంగా ఉంటుంది. దీంతో 24 గంటలూ ఫ్యా¯ŒS లేదా ఏసీ లేకపోతే ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడక తప్పదు. ఇటువంటి పరిస్థితులున్న వేసవిలోనే విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం ప్రజలకు మరింత భారంగా మారనుంది.
జిల్లాలో గృహ వినియోగదారులు 13,82,084 మంది ఉన్నారు. విద్యుత్ వినియోగాని్నబట్టి వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. ఏడాదిలో 900 యూనిట్లకన్నా తక్కువ వాడకం ఉన్నవారిని ఎ–గ్రూపుగా, 900 నుంచి 2,700 యూనిట్లు వినియోగిస్తున్నవారిని బి–గ్రూపుగా, 2,700 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నవారిని సి–గ్రూపుగా విభజించారు. 7,52,416 మంది ఉన్న ఎ–గ్రూపు వినియోగదారులపై ఎటువంటి చార్జీల పెంపూ ఉండదు. 5,66,579 మంది వినియోగదారులున్న బి–గ్రూపుపై మాత్రం కస్టమర్ చార్జీల పేరిట ఒక్కొక్కరికి నెలకు రూ.10 చొప్పున చార్జీలు పెంచారు. 63,089 మంది ఉన్న సి–గ్రూపు వినియోగదారులపై మాత్రం చార్జీల పెంపు భారం పడింది. యూనిట్ల వాడకాని్నబట్టి వీరు సరాసరి 3 శాతం మేర అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
టెలిస్కోపిక్ విధానంలోనే..
2004కు ముందు యూనిట్ శ్లాబ్ విధానం ఉండేది. ఒక్కో శ్లాబ్‌వారికి ఒక్కోవిధంగా యూనిట్ ధర ఉండేది. అప్పటివరకూ స్లాబ్ దాటి ఒక్క యూనిట్ అధికంగా విద్యుత్ వాడితే మొత్తం యూనిట్లకు ఒకే ధర చెల్లించాల్సి వచ్చేది. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. వినియోగదారులపై అధిక భారం పడకుండా టెలిస్కోపిక్ విధానం ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రతి 50 యూనిట్లకు ఒక్కోవిధంగా ధర ఉంటుంది. 50 యూనిట్ల చొప్పున మొత్తం యూనిట్లపై చార్జీలు లెక్కిస్తారు.
200 యూనిట్లు దాటితే బాదుడే..
వినియోగదారులను మూడు గ్రూపులుగా విభజించారు. ప్రస్తుతం పెంచిన చార్జీల ప్రకారం 200 యూనిట్లకన్నా తక్కువగా వినియోగించుకునే గృహ వినియోగదారులకు (ఎ–గ్రూపు) మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ.1.45, 51 నుంచి 100 యూనిట్ల వరకూ రూ.2.60, 101 నుంచి 200 వరకూ రూ.3.60 చొప్పున చార్జీలు లెక్కిస్తారు. దీనికి అదనంగా 50 యూనిట్లలోపు బిల్లు వస్తే కస్టమర్ చార్జీ రూ.25, 100 యూనిట్లలోపు రూ.30, 200 యూనిట్లలోపు రూ.35 వసూలు చేస్తారు. ఇక 200 నుంచి 300 యూనిట్ల మధ్య వినియోగించుకుంటే (బి–గ్రూపు) పైన పేర్కొన్న రేట్లు దాదాపు రెట్టింపవుతాయి. మొదటి 100 యూనిట్లకు రూ.2.60 (ఒక యూనిట్ ధర), 101 నుంచి 200 యూనిట్లకు రూ.3.60, 201 నుంచి 300 యూనిట్ల వరకు ఏకంగా రూ.6.90 లెక్కన యూనిట్ ధర లెక్కిస్తారు. ఇక మూడు నుంచి 500 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారిని సి–గ్రూపుగా పరిగణిస్తారు. ఇందులో 300 యూనిట్ల వరకూ బి–గ్రూపు వినియోగదారులకన్నా చార్జీలు స్వల్పంగా పెరిగాయి. 301 నుంచి 400 వరకు యూనిట్ ధర రూ.7.98, 401 నుంచి 500 వరకు రూ.8.52, 500 యూనిట్ల నుంచి ఎంత వాడుకున్నా యూనిట్ ధర రూ.9.06 లెక్కన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీల ప్రకారం జిల్లాలోని పరిశ్రమలపై నెలకు రూ.2.21 కోట్ల భారం పడనుంది.
స్థానిక సంస్థలపై బాదుడు
పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలపై కూడా పెరిగిన చార్జీల భారం పడనుంది. ఆయా స్థానిక సంస్థల్లో వీధిదీపాల కోసం వినియోగించే విద్యుత్ చార్జీలు 4 శాతం పెరిగాయి. జిల్లాలోని 1067 పంచాయతీల పరిధిలో ఉన్న 6,616 వీధిదీపాలకు యూనిట్ ధర రూ.5.98, కస్టమర్ చార్జీ రూ.35 వసూలు చేయనున్నారు. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న 936 వీధిదీపాలకు వినియోగించే విద్యుత్‌కు యూనిట్ ధర రూ.6.53, కస్టమర్ చార్జీలు రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో ఉన్న 1234 వీధిదీపాలకు యూనిట్ ధర రూ.709, కస్టమర్ చార్జీలు రూ.35 చొప్పున వసూలు చేయనున్నారు.
ఏడాదికి రూ.1,743 కోట్ల వసూళ్లు
జిల్లాలో అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి ఏపీఈపీడీసీఎల్ ఏడాదికి రూ.1743 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేస్తోంది. లో టెన్ష¯ŒS (ఎల్‌టీ) వినియోగదారుల నుంచి రూ.1036 కోట్లు, హై టెన్ష¯ŒS (హెచ్‌టీ) వినియోగదారుల నుంచి రూ.706 కోట్లు వసూలవుతున్నాయి.