april month
-
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
పుంజుకున్న ఆర్టీసీ.. లాభాలబాట పట్టించిన శుభ ముహూర్తాలు
శుభ ముహూర్తాలు ఆర్టీసీని లాభాల బాటపట్టించాయి. ఏప్రిల్‌లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి జీతాలిచ్చేందుకు సంస్థ ఇబ్బందిపడ్డ పరిస్థితి మారి.. ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదవుతోంది. శుభముహూర్తాలు కొనసాగినన్ని రోజులు పరిస్థితి మెరుగ్గా ఉండనుంది. అలాగే, రానున్న వానాకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది. రికార్డు స్థాయి లాభాలతో.. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడిన స్వల్ప కాలానికే ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్‌తో వేతన సవరణ జరిగింది. దీంతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల భారం పడింది. అనంతరం పర్యవేక్షణ లోపించడంతో ఆర్టీసీ పనితీరు దిగజారింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నష్టాల కంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పెరిగిపోయాయి. డిపోలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇన్నాళ్లకు తొలిసారి 96 డిపోలకు 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవడంతో ఓఆర్ 58 శాతానికి పడిపోయి, రోజు వారీ ఆదాయం సగటున రూ.11.50 కోట్లకు పరిమితమైంది. మేలో ముహూర్తాల కాలం ప్రారంభం కావటంతో ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ పుంజుకుంది. ఆదాయం రూ.16 కోట్లను మించి నమోదుకాగా, సగటున వారం రోజులుగా రూ.15.50 కోట్ల మేర వస్తోంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే.. షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, అచ్చంపేట, తాండూరు, జనగామ, వేములవాడ, బీహెచ్ఈఎల్, మహేశ్వరం, మెట్పల్లి, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, మణుగూరు, గద్వాల, కరీంనగర్–1, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్–1, పికెట్, యాదగిరిగుట్ట, హైదరాబాద్–2, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్–1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్. చదవండి: ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు -
April : అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
ముందుగా మీ అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు మీ అందరి ఆరోగ్యం బాగుండాలని, మీ ఆర్థిక వ్యవహారాలు ఏ చింతలు లేకుండా జరగాలని కోరుకుంటూ .. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చే కీలక అంశాలు మీకోసం. ► అనుసంధానించకపోతే ‘పాన్’ పనిచేయదు: అవును. 31–3–2022 తేదీలోపల పాన్‌తో అనుసంధానం చేయని వారి పాన్ పనిచేయదు. దాన్ని స్తంభింపచేస్తారు. వాడుకలో ఉండదు. చెల్లుబడి కాదు. అంటే మీరు ఏ సందర్భంలోను పాన్ని ప్రస్తావించాలో, ఏ సందర్భంలో అయితే నంబర్‌ను పేర్కొనాలో ఆ సమయంలో పాన్ వాడకూడదు. అంటే కొన్ని ఆర్థిక వ్యవహారాలు చేయలేరు. అయితే, డిపార్ట్మెంట్పరమైన కార్యకలాపాల్లో ఇది చలామణీలో ఉంటుంది. అనుసంధానం చేయకపోవడం .. రద్దు వల్ల వాడకూడదు కాబట్టి ఇవ్వలసిన చోట ఇవ్వకపోయినా.. పాన్ తెలియజేసినా .. పాన్ని ప్రస్తావించినా శిక్షార్హులు. కొందరు ఇక్కడ ఉండీ అనుసంధానం చేయలేదు. మరికొందరు విదేశాల్లో ఉండిపోవడం వల్ల చేయలేదు. అటువంటి వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 1–4–22 నుండి 30–6–2022 వరకూ రూ. 500, అది దాటితే 1–7–2022 నుండి 31–3–2023 వరకూ రూ. 1,000 ఫీజు కింద చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత పాన్‌ను మళ్లీ యధావిధిగా వాడుకోవచ్చు. ► క్రిప్టో ఆస్తుల మీద పన్ను: 2022 ఏప్రిల్ 1 నుండి క్రిప్టో కరెన్సీలపై, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) మీద 30 శాతం పన్ను విధిస్తారు. 31–03–2023 నాటి విలువ మీద పన్ను చెల్లించాలి. ► ఆదాయపు పన్ను మదింపులో అధికారులు ముసుగు వేసుకున్న వీరుల్లా తయారవుతారు. ఒకరి ముఖం ఒకరికి కనపడదు. అంతా ఫేస్లెస్సే. ► స్థిరాస్తుల వ్యవహారాల్లో (వ్యవసాయ భూములకు వర్తించదు) రూ. 50,00,000 ప్రతిఫలం దాటిన కేసుల్లో స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందంలో పేర్కొన్న విలువ .. ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తం మీద టీడీఎస్ రికవరీ చేయాలి. 1 శాతం చొప్పున చేయాలి. గతంలో కేవలం ఒప్పంద విలువ మీద చేయాల్సి వచ్చేది. కొత్త రూల్స్ ప్రకారం స్టాంప్ డ్యూటీని తీసుకువచ్చారు. ► మరో అశనిపాతంలాంటిది ఏమిటంటే.. ప్రావిడెంట్ ఫండ్ మీద వడ్డీపరంగా ప్రతికూల పరిణామం. గతంలో మనం తెలుసుకున్నాం ఉఉఉ (పన్నుపరమైన మినహాయింపుల) గురించి. కానీ కొత్త రూల్స్ ప్రకారం పీఎఫ్ జమలు రూ. 2,50,000 దాటితే ఆ ఆదనం మీద వచ్చే దాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అంటే పరోక్షంగా రూ. 2,50,000 దాటి జమ చేసినందుకు ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ఉన్న స్కీముల్లో పీపీఎఫ్ అత్యుత్తమం. హైక్లాస్ ఆదాయం ఉన్న వారికి దెబ్బ. సాధారణ, మధ్యతరగతి వారికి ఎటువంటి నష్టం లేదు. ► కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులకు మినహాయింపు లభిస్తుంది. అయి తే అన్ని కాగితాలు, రుజువులు ఉండాలి. -
పవర్ పిడుగు
నెలకు రూ.3.53 కోట్ల భారం పరిశ్రమలపై మరో రూ.2.21 కోట్ల బాదుడు 200 యూనిట్ల తర్వాత యూనిట్ ధర రూ.7 సాక్షి, రాజమహేంద్రవరం : సాధారణంగా వేసవిలోనే గృహ విద్యుత్ వాడకం అధికంగా ఉంటుంది. సరిగ్గా ఇదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఈ నెల నుంచే అమలులోకి వచ్చాయి. మన జిల్లాలో వేసవి వాతావరణం ఇతర జిల్లాల కన్నా భిన్నంగా ఉంటుంది. గోదావరిలో ప్రవాహం తగ్గి ఇసుక తిన్నెలు బయటపడడం.. సముద్రతీరం కావడంతో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వేడి అధికంగా ఉంటుంది. దీంతో 24 గంటలూ ఫ్యా¯ŒS లేదా ఏసీ లేకపోతే ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడక తప్పదు. ఇటువంటి పరిస్థితులున్న వేసవిలోనే విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం ప్రజలకు మరింత భారంగా మారనుంది. జిల్లాలో గృహ వినియోగదారులు 13,82,084 మంది ఉన్నారు. విద్యుత్ వినియోగాని్నబట్టి వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. ఏడాదిలో 900 యూనిట్లకన్నా తక్కువ వాడకం ఉన్నవారిని ఎ–గ్రూపుగా, 900 నుంచి 2,700 యూనిట్లు వినియోగిస్తున్నవారిని బి–గ్రూపుగా, 2,700 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నవారిని సి–గ్రూపుగా విభజించారు. 7,52,416 మంది ఉన్న ఎ–గ్రూపు వినియోగదారులపై ఎటువంటి చార్జీల పెంపూ ఉండదు. 5,66,579 మంది వినియోగదారులున్న బి–గ్రూపుపై మాత్రం కస్టమర్ చార్జీల పేరిట ఒక్కొక్కరికి నెలకు రూ.10 చొప్పున చార్జీలు పెంచారు. 63,089 మంది ఉన్న సి–గ్రూపు వినియోగదారులపై మాత్రం చార్జీల పెంపు భారం పడింది. యూనిట్ల వాడకాని్నబట్టి వీరు సరాసరి 3 శాతం మేర అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టెలిస్కోపిక్ విధానంలోనే.. 2004కు ముందు యూనిట్ శ్లాబ్ విధానం ఉండేది. ఒక్కో శ్లాబ్వారికి ఒక్కోవిధంగా యూనిట్ ధర ఉండేది. అప్పటివరకూ స్లాబ్ దాటి ఒక్క యూనిట్ అధికంగా విద్యుత్ వాడితే మొత్తం యూనిట్లకు ఒకే ధర చెల్లించాల్సి వచ్చేది. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. వినియోగదారులపై అధిక భారం పడకుండా టెలిస్కోపిక్ విధానం ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రతి 50 యూనిట్లకు ఒక్కోవిధంగా ధర ఉంటుంది. 50 యూనిట్ల చొప్పున మొత్తం యూనిట్లపై చార్జీలు లెక్కిస్తారు. 200 యూనిట్లు దాటితే బాదుడే.. వినియోగదారులను మూడు గ్రూపులుగా విభజించారు. ప్రస్తుతం పెంచిన చార్జీల ప్రకారం 200 యూనిట్లకన్నా తక్కువగా వినియోగించుకునే గృహ వినియోగదారులకు (ఎ–గ్రూపు) మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ.1.45, 51 నుంచి 100 యూనిట్ల వరకూ రూ.2.60, 101 నుంచి 200 వరకూ రూ.3.60 చొప్పున చార్జీలు లెక్కిస్తారు. దీనికి అదనంగా 50 యూనిట్లలోపు బిల్లు వస్తే కస్టమర్ చార్జీ రూ.25, 100 యూనిట్లలోపు రూ.30, 200 యూనిట్లలోపు రూ.35 వసూలు చేస్తారు. ఇక 200 నుంచి 300 యూనిట్ల మధ్య వినియోగించుకుంటే (బి–గ్రూపు) పైన పేర్కొన్న రేట్లు దాదాపు రెట్టింపవుతాయి. మొదటి 100 యూనిట్లకు రూ.2.60 (ఒక యూనిట్ ధర), 101 నుంచి 200 యూనిట్లకు రూ.3.60, 201 నుంచి 300 యూనిట్ల వరకు ఏకంగా రూ.6.90 లెక్కన యూనిట్ ధర లెక్కిస్తారు. ఇక మూడు నుంచి 500 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారిని సి–గ్రూపుగా పరిగణిస్తారు. ఇందులో 300 యూనిట్ల వరకూ బి–గ్రూపు వినియోగదారులకన్నా చార్జీలు స్వల్పంగా పెరిగాయి. 301 నుంచి 400 వరకు యూనిట్ ధర రూ.7.98, 401 నుంచి 500 వరకు రూ.8.52, 500 యూనిట్ల నుంచి ఎంత వాడుకున్నా యూనిట్ ధర రూ.9.06 లెక్కన చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీల ప్రకారం జిల్లాలోని పరిశ్రమలపై నెలకు రూ.2.21 కోట్ల భారం పడనుంది. స్థానిక సంస్థలపై బాదుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలపై కూడా పెరిగిన చార్జీల భారం పడనుంది. ఆయా స్థానిక సంస్థల్లో వీధిదీపాల కోసం వినియోగించే విద్యుత్ చార్జీలు 4 శాతం పెరిగాయి. జిల్లాలోని 1067 పంచాయతీల పరిధిలో ఉన్న 6,616 వీధిదీపాలకు యూనిట్ ధర రూ.5.98, కస్టమర్ చార్జీ రూ.35 వసూలు చేయనున్నారు. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న 936 వీధిదీపాలకు వినియోగించే విద్యుత్‌కు యూనిట్ ధర రూ.6.53, కస్టమర్ చార్జీలు రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో ఉన్న 1234 వీధిదీపాలకు యూనిట్ ధర రూ.709, కస్టమర్ చార్జీలు రూ.35 చొప్పున వసూలు చేయనున్నారు. ఏడాదికి రూ.1,743 కోట్ల వసూళ్లు జిల్లాలో అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి ఏపీఈపీడీసీఎల్ ఏడాదికి రూ.1743 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేస్తోంది. లో టెన్ష¯ŒS (ఎల్టీ) వినియోగదారుల నుంచి రూ.1036 కోట్లు, హై టెన్ష¯ŒS (హెచ్‌టీ) వినియోగదారుల నుంచి రూ.706 కోట్లు వసూలవుతున్నాయి. -
ఏప్రిల్‌లోనే పాలీసెట్!
ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపైనా ప్రశ్నలు సోషల్‌లో తెలంగాణ చరిత్రపై ప్రశ్నలు, వాటికి మార్కులు కసరత్తు చేస్తున్న సాంకేతిక విద్యా, శిక్షణ మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్–2017 నుంచి వచ్చే ఏప్రిల్‌లోనే నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. దాంతోపాటు ఈసారి ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులను ప్రవేశపెడుతోంది. ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. విద్యార్థులు పాలిటెక్నిక్ చదవాల్సింది ఇంగ్లిష్ మీడియంలోనే అయినందున ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. దాంతోపాటు సోషల్ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం, చరిత్రకు సంబంధించిన అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర చరిత్రపైనా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వాటిపై ప్రశ్నలు అడిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటికి ఎక్కువ మొత్తంగా మార్కులు ఇవ్వకుండా, కేవలం విద్యార్థుల అవగాహనను మాత్రమే పరీక్షించేలా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ భాషకు సంబంధించిన పరిజ్ఞానంపై 10 మార్కులు కలిగిన అంశాలను అడగనుంది. సోషల్‌లోనూ అంతే. 10 మార్కులకు సోషల్ సంబంధ ప్రశ్నలు అడిగేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు పాలీసెట్ పరీక్షలో ఈ అంశాలను అడగలేదు. 2017 పాలీసెట్‌లో మాత్రం వాటిపై ప్రశ్నలు ఉండనున్నాయి. వాటితోపాటు మరో 100 మార్కులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఈ మూడు సబ్జెక్టుల్లోనే 120 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఇకపై ఆ మార్కులను తగ్గించారు. కేవలం 100 మార్కులకే ఆ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి. ఇదీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష స్వరూపం సబ్జెక్టు గతంలో మార్కులు ప్రస్తుత మార్కులు మ్యాథ్స్ 60 50 ఫిజిక్స్ 30 25 కెమిస్ట్రీ 30 25 ఇంగ్లిష్ – 10 సోషల్ – 10