భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన
నెల్లూరు(బృందావనం): శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో మంగళవారం బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు సామూహిక లక్ష కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు, నిషింద సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక కృష్ణస్తోత్రం, లక్ష్మీఅష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామార్చన జరిగింది. తొలుత స్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. దేవస్థాన పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు.