పోరాటాలతోనే సమస్యల పరిష్కారం | problams are solved with fite | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Published Mon, Sep 5 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

  • ములాఖత్‌ అయితే ప్రయోజనం ఉండదు
  • టీయూడబ్ల్యూజే సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్‌ అమర్‌
  • న్యూశాయంపేట : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని, ప్రభుత్వంతో ములాఖత్‌ అయితే సమస్యలు పరిష్కారం కావని ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తోం దని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన సంఘాలు కేవలం వాట్సప్‌ సంఘాలుగా మారాయని ఎద్దేవా చేశారు. సమస్యలపై వాటికి చిత్తశుద్ధి లేదని, సర్కా రు సంఘాలుగా మారాయని విమర్శించారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జిల్లా కన్వీనర్‌ తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.
     
    కావాలనే జర్నలిస్టుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో..
    నయీం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయట పెట్టిన సిట్‌ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్‌ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు కూడా బహిర్గతం చేయాలని అమర్‌ డిమాండ్‌ చేశారు. ప్రోగ్రాం కవరేజ్‌ కోసం వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్‌ ఇస్తే.. నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు ఓ వ్యక్తి బహిర్గతం చేస్తే ఎఫ్‌ఐఆర్‌లో పెడతారా అని ప్రశ్నించారు. విలేకరులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించా రు. మావోయిస్టు నేత జగన్‌ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారని ఎదుటి సంఘం నేతలు పేర్కొనడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు. సమస్యల పరిష్కారానికి యూనియన్‌ సానుకూల ధోరణితోనే ఉంటుందని తెలిపారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ జర్నలి స్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నాయకులు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చా క శత్రువులుగా మారుతారన్నారు. జర్నలిస్టులు ఎ ప్పుడు ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజ ల కు వార్తల ద్వారా నివేదించాలన్నారు. ఈ సందర్భం గా యూనియన్‌లో పలువురు జర్నలిస్టు నేతలు చేరగా.. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు, ఎన్నికల పరిశీలకులు కరుణాకర్, రమేష్, దాసరి కృష్ణారెడ్డి, డి.రమేష్, వల్లాల వెంకటరమణ, కె.కుమారస్వామి, సంపత్, బుచ్చిరెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. 

Advertisement

పోల్

Advertisement