tuwj(iju)
-
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ములాఖత్ అయితే ప్రయోజనం ఉండదు టీయూడబ్ల్యూజే సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ న్యూశాయంపేట : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గమే శరణ్యమని, ప్రభుత్వంతో ములాఖత్ అయితే సమస్యలు పరిష్కారం కావని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తోం దని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన సంఘాలు కేవలం వాట్సప్ సంఘాలుగా మారాయని ఎద్దేవా చేశారు. సమస్యలపై వాటికి చిత్తశుద్ధి లేదని, సర్కా రు సంఘాలుగా మారాయని విమర్శించారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కావాలనే జర్నలిస్టుల పేర్లు ఎఫ్ఐఆర్లో.. నయీం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయట పెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు కూడా బహిర్గతం చేయాలని అమర్ డిమాండ్ చేశారు. ప్రోగ్రాం కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్ ఇస్తే.. నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు ఓ వ్యక్తి బహిర్గతం చేస్తే ఎఫ్ఐఆర్లో పెడతారా అని ప్రశ్నించారు. విలేకరులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించా రు. మావోయిస్టు నేత జగన్ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారని ఎదుటి సంఘం నేతలు పేర్కొనడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు. సమస్యల పరిష్కారానికి యూనియన్ సానుకూల ధోరణితోనే ఉంటుందని తెలిపారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ జర్నలి స్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నాయకులు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చా క శత్రువులుగా మారుతారన్నారు. జర్నలిస్టులు ఎ ప్పుడు ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజ ల కు వార్తల ద్వారా నివేదించాలన్నారు. ఈ సందర్భం గా యూనియన్‌లో పలువురు జర్నలిస్టు నేతలు చేరగా.. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు, ఎన్నికల పరిశీలకులు కరుణాకర్, రమేష్, దాసరి కృష్ణారెడ్డి, డి.రమేష్, వల్లాల వెంకటరమణ, కె.కుమారస్వామి, సంపత్, బుచ్చిరెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వాలి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలి వివిధ పార్టీల మద్దతు కరీంనగర్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా, వంటావార్పు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడారు. తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం బాధకరమన్నారు. అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నీతూప్రసాద్‌కు సమర్పించారు. ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, బీఎస్పీ జిల్లా నాయకుడు నిశాని రాంచంద్రం, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి, వైఎస్సార్ సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగే పద్మ మద్దతు తెలిపారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
22న చలో కలెక్టరేట్ ముకరంపుర: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ , జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ అన్నారు. హక్కుల సాధన కోసం జర్నలిస్టులు సంఘటితమై శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న తలపెట్టిన చలో కలెక్టరేట్ పోస్టర్‌ను శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా జీవో వచ్చేందుకే ఏడాది పట్టిందని, అయినా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అమలు కాని దుస్థితి ఉందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులిచ్చి ప్రతీ కార్పొరేట్ ఆస్పత్రిలో అమలయ్యేలా చూడాలన్నారు. ఇళ్లు, స్థలాల హామీ నీటిమూటగానే మిగిలిందన్నారు. అక్రిడిటేషన్ల మార్గదర్శకాల కోసం నియమించిన కమిటీ సూచనలు కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేలా 239 జీవోను సవరించి తక్షణమే జారీ చేయాలన్నారు. సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ ఎదుట వంటావార్పు ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా నాయకులు బల్మూరి విజయసింహారావు, ఎలగందుల రవీందర్, అయిలు రమేశ్, శరత్, దూలూరి జగన్మోహన్, పి.ప్రభుదాస్, విజయేందర్‌రెడ్డి, వెంకట్ తదితరులున్నారు.