విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం
అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తులసీరావు
ఎచ్చెర్ల క్యాంపస్ : ప్రస్తుతం విద్యా ప్రమాణాలు మెరుగుపడవల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలు విద్యలో ఉంటేనే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగు పడతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు అన్నారు. ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 12 వరకు జరిగిన అంతర్జాతీయ ఫిక్కీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రత్యేకంగా ఏపీ నాలెడ్‌స హబ్ అన్న అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సు వివరాలను ఆయన పరిపాలన కార్యాలయంలో విలేకరులకు మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యలో ప్రక్షాళన అవసరంగా చెప్పారు. ప్రస్తుతం మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంలో ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవటం, స్కైఫ్ విద్యా విధానం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత విద్యా విధానం అభివృద్ధి చెందాలంటే విదేశీ విద్యాలయాలు, దేశంలోని ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ లాంటి విద్యాలయాలుతో అనుసంధానం చేయవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విదేశీ ఒప్పందాలు వల్ల విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని చెప్పారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, జాతీయ సాంకేతి క మండలి వంటి సంస్థలు విద్యా ప్రమాణాలు మెరుగుకు ప్రత్యేక దృష్టి పెట్టవల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి విశ్వవిద్యాలయల్లో మౌలిక వసతులు కల్పించటం, ఛారుుస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం అమలు చేయటం, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌సకు ప్రాధాన్యతనివ్వటం, టీచింగ్ సిబ్బందిని నియమించటం వంటి అంశాలు కీలకంగా వివరించారు.
విదేశీ విద్యతో పోల్చి చూస్తే మన విద్యా ప్రమాణాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. అమెరికా, జపాన్, సౌత్ కోరియా, బ్రిటన్ వంటి దేశాల్లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన విద్యలో సంక్షరణలు అమలు చేయవల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలంటే విద్యా విధానంలో మార్పులతోనే సాధ్యమని తులసీరావు చెప్పారు.\