ప్రాజెక్ట్ వరద నీటిలోనే మిషన్ భగీరథ
Published Tue, Aug 2 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటి మట్టం 146.80 మీటర్లు కాగా, ఎల్లంపల్లిలో దాదాపు 16 టీఎంసీలపైగా నీటి సామర్థ్యం ఉంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో చేపడుతున్న మిషన్ భగీరథ(వాటర్ గ్రిడ్) పనులు ఇంకా నీట మునిగి ఉన్నాయి. దాదాపు ఆరు రోజులుగా ఈ పనులు మొత్తం నీటిలోనే ఉండటంతో పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం, ప్రాజెక్ట్‌లో ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రూ. 8 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో స్లాబ్ పనులు పూర్తి కాగా, 20 శాతం పనులు..ఫుట్‌బ్రిడ్జ్, బ్రిక్స్ వర్క్స్, మోటార్ల బిగింపు తదితర పనులు మిగిలి ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరగడంతో ఇంటెక్ వెల్ పనులు నిలిచిపోయాయి. ఓ వైపు సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ కాగా ఇంకా ఈ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు నీట మునగడంతో పనులు తిరిగి ప్రారంభం కావడంతో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ఇప్పట్లో వరద నీరు తగ్గే అవకావం కనిపించడం లేదు. ఏది ఏమైనా పనులు ప్రారంభం కావాలంటే నీరు తగ్గే వరకు వేచి చూడటం తప్పదు.
Advertisement