వేశ్య, పూసలి జీవనశైలిపై ఆధ్యయనం
జగదేవ్‌పూర్:జగదేవ్‌పూర్‌లో వేశ్య, కూలాల బతుకలు, పూసలి కూలాల జీవనశైలిపై శనివారం తెలంగాణ స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కో అపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు ఆధ్యయనం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు జగదేవ్‌పూర్ వచ్చి ముందుగా వేశ్య గృహాలవద్దకు వెళ్లారు. అక్కడి వారి జీవన పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం పూసలి కూలాల వద్దకు వెళ్లి వారితో గంటపాటు బతుకు స్థితిగతులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వెనుకబడిన కులాలపై ఆధ్యయనం చేసి వారి జీవన పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొవడం జరుగుతుందన్నారు. అలాగే వారికి అవగాహన కల్పించి ఉపాధి మార్గాలను కల్పిస్తామన్నారు. సోమవారం సచివాలయం నుంచి జగదేవ్‌పూర్‌కు ప్రభుత్వ అధికారులు రానున్న సందర్భంగా ముందుగా వారి జీవనశైలిని అధ్యయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈడీ రాంరెడ్డి, గజ్వేల్ బీసీ వసతి గృహల బాధ్యులు పుష్పలత పాల్గొన్నారు.