- నైతిక బాధ్యతతో మొక్కలు నాటాలి
- వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాక్‌రావు
అంతరించిపోతున్న అడవులను కాపాడాలి
Published Wed, Jul 20 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
జైపూర్ : అంతరించిపోతున్న ఆడవులను కాపాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి హరితహారం కార్యక్రమం చేపడుతోందని ప్రతిఒక్కరూ నైతికబాధ్యతతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వరంగల్ రేంజ్ డీఐజీ టీ.ప్రభాకర్‌రావు తెలిపారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పోలీస్ జనమైత్రి కార్యక్రమంలో భాగంగా స్థానిక శివసాయి రైస్ మిల్లులో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హరితహారం కార్యక్రమానికి వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై రైస్‌మిల్లు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, స్థానిక సర్పంచ్ జక్కుల వెంకటేశం, ఎంపీటీసీ సభ్యురాలు కె.రజిత, శ్రీరాంపూర్ సీఐ డి.వేణుచందర్, జనమైత్రిపోలీస్ అధికారి, ఏఎస్సై గంగన్న, శివసాయి రైస్‌మిల్లు నిర్వహకులు ఎన్.కాంతయ్య, రాజలింగం, పోలీస్‌శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Advertisement