ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన | Protest against the dredging of sand | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన

Published Thu, Apr 28 2016 4:41 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Protest against the dredging of sand

హల్దీవాగు నుంచి ఇసుక తవ్వకానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టిన సంఘటన మెదక్‌జిల్లా వెల్దుర్థిలో గురువారం జరిగింది. ఇసుక తవ్వకానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ తహశీల్దార్‌కు గ్రామపంచాయతీ తీర్మాన పత్రాన్ని అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మట్లాడుతూ హల్దీవాగులో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పంటలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని, రైతుల విన్నపాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని తహసిల్దార్ రైతులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా హల్దీ వాగు నుండి లారీలు, ట్రాక్టర్‌ల ద్వారా అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి అక్రమార్కులపై కటిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement