Published
Tue, Sep 27 2016 10:08 PM
| Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
యాదగిరిగుట్ట: ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి మోటకొండూర్ మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం మోటకొండూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు, మహబూబ్‌పేట, చిన్నకందుకూర్, భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి, చీమలకొండూర్‌ను కాకుండా దూరంగా ఉన్న ఆత్మకూర్ (ఎం) మండలంలోని గ్రామాలను కలిపి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మోటకొండూర్ మండల కేంద్రం కాకుండా కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వైఖరి సరికాదన్నారు. అంతకుముందు మోటకొండూర్ గ్రామంలో ధర్నా నిర్వహించి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, యువజన విభాగం, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.