తహశీల్దార్ కార్యాలయానికి తాళం.. | protesters Locked tahsildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయానికి తాళం..

Published Tue, Sep 20 2016 2:16 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

protesters Locked tahsildar office

- చిన్నకందుకూరు గ్రామస్థుల ఆందోళన
యాదగిరిగుట్ట(నల్గొండ జిల్లా)

 నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం నుంచి తమ గ్రామాన్ని మోటకొండూరులో కలపరాదని డిమాండ్ చేస్తూ చిన్నకందుకూరు గ్రామస్థులు మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. యాదగిరిగుట్ట ఆలయం వద్ద నుంచి దాదాపు 600 మంది ర్యాలీగా తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి కార్యాలయ గేటుకు తాళం వేసి బైఠాయించారు. తహశీల్దార్ వచ్చేంతవరకూ గేటు తాళం తీసేది లేదని వారు భీష్మించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement