పుష్కర స్నానాలు అశాస్త్రీయం
పుష్కర స్నానాలు అశాస్త్రీయం
Published Sun, Jul 31 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
డాక్టర్ సమరం
పటమట(ఆటోనగర్):
పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ట, మూఢత్వానికి ఖరీదు అనేక ప్రాణాలని నాస్తిక కేంద్రం నిర్వాహకులు డాక్టర్ జి.సమరం అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ పుష్కరాల సమయంలో దేవతల గురువు బృహస్పతితో పాటు పుష్కరుడు మూడున్నర కోట్ల మంది దేవతలు నదిలో కొలువై ఉంటారనేది అభూత కల్పన అని అన్నారు. పుక్కిటి పురాణాలతో జనాలను మూఢులుగానూ అజ్ఞానులుగానూ తయారుచే శారని అన్నారు. పుష్కర స్నానంతో వేయి జన్మల పాపమైనా నశించిపోతుందనటం మానవ వివేకాన్ని తాకట్టుపెట్టడమని అన్నారు. భారత రాజ్యాంగంలోని 51ఎ(హెచ్) ప్రకారం శాస్త్రీయ దృష్టిని,పరిశోధించే గుణాన్ని, సంఘ సంస్కరణను పెంపొందించి ప్రతి పౌరుని ప్రా«థమిక విధి అని అన్నారు. తండోపతండాలుగా పుష్కర స్నానాలు చేయటం అశాస్త్రీయమన్నారు. ’పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ఠ– కృష్ణా పుష్కరాలు–తెలుసుకోవలసిన నిజాలు’ అన్న కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హరిసుబ్రమణ్యం, రశ్మి, కీర్తి, డాక్టర్ మారు, డాక్టర్ విజయం, డాక్టర్ దీక్ష, డాక్టర్ జగతి పాల్గొన్నారు.
Advertisement