ఓయూలో జరిగే సభకు రాహుల్
యూపీ ఎన్నికల తర్వాత వచ్చేందుకు సుముఖత: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే సభకు రాహుల్‌గాంధీని పీసీసీ నేతలు ఆహ్వానించారు. యూపీ ఎన్ని కల తర్వాత ఓయూలోని విద్యార్థి, యువ జన సభకు హాజరుకావడానికి రాహుల్ కూడా హామీ ఇచ్చినట్టుగా పీసీసీ నేతలు వెల్లడించారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలపై ఇప్పటికే అధ్యయ నం జరుపుతున్న పీసీసీ.. యువకులు, ఉద్యోగులు, రైతులకు చేరువ కావడానికి వర్గాల వారీగా కార్యాచరణకు దిగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమాజంలో ఎక్కువ శాతం ఉండి, ప్రభావవంతమైన యువతను లక్ష్యం చేసుకుని కార్యాచరణకు దిగాలని యోచిస్తోంది.
ఓటు హక్కును మొదటిసారి పొందిన యువకుల నుంచి ఉద్యోగాలు పొందడానికి అర్హత ఉన్న 30 ఏళ్ల వయసుదాకా ఉన్నవారి ఓట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడలేదనే అంచనాకు వచ్చింది. ఇటీవల పీసీసీ నేతల తో సమావేశం సంద ర్భంగా.. యువత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడా నికి కారణాలు ఏమిట ని ఏఐసీసీ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ ప్రశ్నించినట్టుగా తెలిసిం ది. తెలంగాణ ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం వస్తుందంటూ జరిగిన ప్రచారం కారణంగా టీఆర్‌ఎస్‌కు యువకుల ఓట్లు పడ్డాయని రాహుల్‌కు పీసీసీ నేతలు వివరించినట్టు తెలిసింది.
తెలంగాణలో ఇప్పటిదాకా జరిగి న ఉద్యోగాల భర్తీ.. ఎంతమంది రాష్ట్ర యువ కులకు ఉద్యోగాలు వచ్చాయో అధ్యయనం చేసి, ఉద్యోగాల విషయంలో టీఆర్‌ఎస్ హామీల అమలు వైఫల్యాలపై వాస్తవాలను యువతకు వివరించేలా కార్యాచరణ చేపడ తామని రాహుల్‌కు పీసీసీ నేతలు చెప్పారు. మరోవైపు ఓయూలో నిర్వహించే సభకే పరిమితం కాకుండా గ్రామ, మండల స్థాయి ల్లోనూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించా లని పీసీసీ భావిస్తోంది.