PCC leaders
-
ఓయూలో జరిగే సభకు రాహుల్
యూపీ ఎన్నికల తర్వాత వచ్చేందుకు సుముఖత: కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే సభకు రాహుల్‌గాంధీని పీసీసీ నేతలు ఆహ్వానించారు. యూపీ ఎన్ని కల తర్వాత ఓయూలోని విద్యార్థి, యువ జన సభకు హాజరుకావడానికి రాహుల్ కూడా హామీ ఇచ్చినట్టుగా పీసీసీ నేతలు వెల్లడించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలపై ఇప్పటికే అధ్యయ నం జరుపుతున్న పీసీసీ.. యువకులు, ఉద్యోగులు, రైతులకు చేరువ కావడానికి వర్గాల వారీగా కార్యాచరణకు దిగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమాజంలో ఎక్కువ శాతం ఉండి, ప్రభావవంతమైన యువతను లక్ష్యం చేసుకుని కార్యాచరణకు దిగాలని యోచిస్తోంది. ఓటు హక్కును మొదటిసారి పొందిన యువకుల నుంచి ఉద్యోగాలు పొందడానికి అర్హత ఉన్న 30 ఏళ్ల వయసుదాకా ఉన్నవారి ఓట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడలేదనే అంచనాకు వచ్చింది. ఇటీవల పీసీసీ నేతల తో సమావేశం సంద ర్భంగా.. యువత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడా నికి కారణాలు ఏమిట ని ఏఐసీసీ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ ప్రశ్నించినట్టుగా తెలిసిం ది. తెలంగాణ ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం వస్తుందంటూ జరిగిన ప్రచారం కారణంగా టీఆర్ఎస్కు యువకుల ఓట్లు పడ్డాయని రాహుల్‌కు పీసీసీ నేతలు వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో ఇప్పటిదాకా జరిగి న ఉద్యోగాల భర్తీ.. ఎంతమంది రాష్ట్ర యువ కులకు ఉద్యోగాలు వచ్చాయో అధ్యయనం చేసి, ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ హామీల అమలు వైఫల్యాలపై వాస్తవాలను యువతకు వివరించేలా కార్యాచరణ చేపడ తామని రాహుల్‌కు పీసీసీ నేతలు చెప్పారు. మరోవైపు ఓయూలో నిర్వహించే సభకే పరిమితం కాకుండా గ్రామ, మండల స్థాయి ల్లోనూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించా లని పీసీసీ భావిస్తోంది. -
వైఎస్ మార్గంలో కాంగ్రెస్
టీపీసీసీ నివాళి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ పేర్కొంది. శుక్రవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఘన నివాళులర్పించింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ నేతలు మాట్లాడుతూ, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప దార్శనికుడని, పేదల పట్ల అభిమానం చూపించిన మానవతావాది అని కొనియాడారు. వైఎస్ చూపించిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదన్నారు. -
దళితులను అణగదొక్కుతున్న ప్రభుత్వం
పీసీసీ నేతల విమర్శ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేర్చకుండా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు దళితులను అణగదొక్కే కుట్రలు చేస్తున్నాయని పీసీసీ నేతలు విమర్శించారు. ఇందిర భవన్లో గురువారం అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, సాకే శైలజానాథ్, సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, శాంతిభూషణ్ తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదంతా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ఆయన జన్మస్థలంలో రాహుల్ గాంధీ గతేడాది జూన్ 2న ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కుల, మత అసహనాలను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. బీజేపీ, టీడీపీలు దళిత, గిరిజన, బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. -
పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వైఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన రాజకీయాలకతీతంగా 8 కోట్ల మందికి సంక్షేమ పథకాలందించి సీఎం ఎలా ఉండాలి.. ఎలా ఉండొచ్చు అని నిరూపించారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పీసీసీ నేతలు కొనియాడారు. వైఎస్ 66వ జయంతి సందర్భంగా బుధవారమిక్కడ ఇందిరాభవన్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు, సాగునీరు, ఇతర అభివృద్ధి పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమలయ్యాయంటే అదంతా వైఎస్ చలవేనన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకందించడంలో ఆయన ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది చూడలేదన్నారు. సంక్షేమ పథకాలు వైఎస్ చలవే: ఉత్తమ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రస్తుతం సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే వైఎస్ చలవేనన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ తదితర పథకాలను సమర్థంగా అమలు చేశారని, బడుగు, బలహీనవర్గాల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులిద్దరూ పథకాల పేర్లు మార్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు అందట్లేదని చెప్పారు. ఏపీ శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి లేనిలోటు పూడ్చలేనిదన్నారు. తెలంగాణ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులెదురైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి 1.30 లక్షలమంది మైనార్టీలకు ఉన్నతవిద్యను అందజేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కలు మాట్లాడుతూ.. వైఎస్ లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలద్వారా తెలుగు ప్రజలు రోజూ గుర్తు చేసుకుంటుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్‌సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుమకుమార్, కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్‌లతోపాటు కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు హాజరయ్యారు. -
'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పీసీసీ, సీఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకతను వీహెచ్ ఈ సందర్భంగా విశదీకరించారు. బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు వీహెచ్ సూచించారు. -
బెజవాడలోనే కార్యాలయాలు
- అన్ని పార్టీల సన్నాహాలు - ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ కార్యాలయం - బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో సీపీఎం - విశాలాంధ్ర భవన్‌నుంచి సీపీఐ - టీడీపీలోనూ మొదలైన చర్చ సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన దాదాపు పూర్తికావడంతో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎక్కడన్నది ఇప్పటికీ నిర్ణయించకపోయినా.. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండవచ్చన్న వార్తలు రావడం, సీఎం క్యాంపు కార్యాలయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో ఆయా పార్టీలు తమ రాష్ట్ర కార్యాలయాలను విజయవాడలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ ఎన్నికలకు ముందే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. - కాంగ్రెస్ కూడా విజయవాడ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. విజయవాడలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌కు చారిత్రక నేపథ్యం ఉండడం, నగరం నడిబొడ్డున సువిశాలమైన స్థలం ఉండడంతో అక్కడే రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ నేతలు దీని వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని ఉపయోగించాలా, దాన్ని పడగొట్టి కొత్తది నిర్మించాలా అన్న విషయంపై చర్చిస్తున్నారు. - సీపీఎం రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కొత్తగా నిర్మిస్తున్న మాకినేని బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకానుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ అధ్యయన కేంద్రం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. - సీపీఐ కూడా గురువారం రెండు కమిటీలు ఏర్పాటు చేసుకోనుంది. ప్రస్తుతానికి రెండు కమిటీలు హైదరాబాద్‌లోని మక్దూమ్ భవన్‌లోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలోని విశాలాంధ్ర భవనంలో ఏర్పాటు చేసి ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. - తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పటివరకు ఆ పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడంతో కొత్తగా స్థలసేకరణ చేసి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.