రాయదుర్గం రూరల్ : రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం మీదుగా బెంగళూరుకు వెళ్లే రైల్వేలైన్‌ను చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏ.కే. గుప్తా, చీఫ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైలు వెళ్లే మార్గాలను మ్యాపుల ద్వారా అధికారులకు వివరించారు. మోటార్ ట్రాలీపై 40 కిలోమీటర్లు వెళ్లి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. అక్టోబర్‌లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకూ కొత్త రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్యాకింగ్ మిషన్ ద్వారా పనులు వేగవంతం చేయాలని అధికారులను వారు ఆదేశించారు.
రైల్వే పనులను అత్యంత నాణ్యతగా నిర్మించాలని సూచించారు. 2012లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకు రైల్వే పనులు ప్రారంభించారు. రైల్వేలైన్ కోసం రెండు విడతల్లో రైతుల భూములను కొనుగోలు చేసి ట్రాక్‌ను నిర్మించారు. మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో నిర్మించిన రైల్వే స్టేషన్ పనులను కూడా వారు పరిశీలించారు. భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైల్వే ట్రాక్ పరిశీలన
Published Thu, Aug 4 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement
Advertisement