సబ్సిడీపై రెయిన్‌గన్‌లు
Published Sat, Aug 27 2016 11:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– యూనిట్ కాస్ట్ రూ.23,524.. రైతులు చెల్లించాల్సింది రూ.9,410
కర్నూలు(అగ్రికల్చర్): 60 శాతం సబ్సిడీపై రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు పంపిణీ చేయనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెయిన్‌గన్ యూనిట్ కాస్ట్ రూ.23,524 ఉండగా ఇందులో 60 శాతం అంటే రూ.14115 సబ్సిడీ ఉంటుందని రైతులు రూ. 9410 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యూనిట్‌లో ఒక రెయిన్‌గన్‌తో పాటు 6 మీటర్ల పొడవు కలిగిన 25 పైపులు ఉంటాయన్నారు. రెయిన్‌గన్‌లు కావాలనుకునే రైతులు నాన్ సబ్సిడీ మొత్తాన్ని ప్రాజెక్టు డైరక్టర్ ఏపీఎంఐపీ కర్నూలు పేరిట డీడీ తీయాలని తెలిపారు. స్ప్రింక్లర్లను 60 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని యూనిట్ కాస్ట్ రూ.17998 ఉండగా సబ్సిడీ రూ.10799 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement